జనసేన మద్దతు కోరిన పిడిఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోతుల నాగరాజు

అన్నమయ్య

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్ పట్టణంలో మంగళవారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతం చేట్టి నాగేంద్ర స్వగృహంలో పిడిఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు, కలిసి మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించి నాగేంద్ర మా రాష్ట్ర కమిటీ అదినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నాదెండ్ల మనోహర్  ఇప్పటికే వైసీపీని ఓడించి అభ్యర్థులు పిడిఎఫ్ కు ఓటేసి గెలిపించాలని పిలుపు ఇచ్చున్నారని, ఆ మేరకు కచ్చితంగా మా యువతకు చెప్పి ఓట్లు వేయిస్తామని గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, సిఐటియు కోశాధికారి, కరతోటి హరి నారాయణ, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పి జాన్ ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు బొజ్జ శివయ్య కలిసిన వారిలో ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest