జ‌యం ర‌వి ‘సైర‌న్‌’ టీజర్ విడుదల

సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు చేతుల మీదుగా జ‌యం ర‌వి ‘సైర‌న్‌’ టీజర్ విడుదల

జ‌యం ర‌వి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘సైర‌న్‌’. హెమ్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సుజాత విజ‌య్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆంటోని భాగ్య‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శుక్ర‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను టాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు విడుద‌ల చేశారు. కోలీవుడ్‌లో వ‌రుస విజ‌యాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న జ‌యం ర‌వి మ‌రోసారి ‘సైర‌న్‌’ వంటి డిఫ‌రెంట్ చిత్రంతో మ‌న ముందుకు రాబోతున్నారు. ఆయ‌న ఇందులో స‌రికొత్త‌గా తొలిసారి సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో క‌నిపించ‌నున్నారు.

‘సైర‌న్‌’ సినిమాపై అనౌన్స్‌మెంట్ రోజు నుంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరుగుతోంది. సైర‌న్‌తో వెళ్లే అంబులెన్స్, జ‌యం ర‌వి సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో ఖైదిగా క‌నిపించ‌టం క్యూరియాసిటీని పెంచాయి. పెరోల్‌పై జ‌యం ర‌వి జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే సీన్ ద్వారా హీరో క్యారెక్ట‌ర్‌ను రివీల్ చేశారు మేక‌ర్స్‌.

టీజ‌ర్‌లో ప్ర‌ధానంగా రెండు పాత్ర‌ల మ‌ధ్య న‌డిచే క‌థ ఇద‌ని చూపించారు. ఖైది పాత్ర‌లో జ‌యం ర‌వి న‌టిస్తుండ‌గా, పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టిస్తున్నారు. సినిమాలో డ్రామా, ట్విస్టులు, ట‌ర్నులు చూస్తుంటే ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత పెంచుతున్నాయి.

అభిమ‌న్యుడు, విశ్వాసం, హీరో వంటి ప‌లు చిత్రాల‌కు రైట‌ర్‌గా ప్రూవ్ చేసుకున్న ఆంటోని భాగ్యరాజ్ సైర‌న్‌ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాంబినేష‌న్‌లో ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. జ‌యం ర‌వి త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నడూ చేయ‌ని విధంగా రెండు డిఫ‌రెంట్ లుక్స్‌తో మెప్పించ‌బోతున్నారు. అలాగే జ‌యం ర‌వి స‌ర‌స‌న కీర్తి సురేష్ తొలిసారి న‌టిస్తుంది. యోగి బాబు త‌న‌దైన కామెడీ పంచుల‌తో న‌వ్వించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. విల‌క్ష‌ణ  న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర ఖ‌ని ఇందులో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు.

చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న సైర‌న్‌ సినిమా పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా ట్రైల‌ర్‌, ఆడియో, మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.


న‌టీన‌టులు:
జ‌యం ర‌వి, కీర్తి సురేష్‌, యోగిబాబు, స‌ముద్ర ఖ‌ని త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

బ్యాన‌ర్‌:  హోమ్ మూవీ మేక‌ర్స్‌
నిర్మాత‌:  సుజాత విజ‌య్ కుమార్‌
ర‌చ‌న‌, దర్శ‌క‌త్వం:  ఆంటోని భాగ్య‌రాజ్‌
సంగీతం:  జి.వి.ప్ర‌కాష్ కుమార్‌
సినిమాటోగ్రపీ:  సెల్వ కుమార్ ఎస్‌.కె
ఎడిట‌ర్‌:  రూబెన్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  క‌దిర్.కె
ఆర్ట్‌:  శ‌క్తి వెంక‌ట్‌రాజ్‌.ఎం
కొరియోగ్ర‌ఫీ:  బృంద‌
కాస్ట్యూమ్స్‌:  అను పార్థ‌సార‌థి, అర్చా మెహ‌తా, నిత్యా వెంక‌టేశ‌న్‌, జెఫ‌ర్‌స‌న్‌.టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  ఒమ‌ర్‌
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌:  శ‌క్త‌ర‌తల్వార్ జి
ప్ర‌మోష‌న్స్ హెడ్:  శ్యామ్ జాక్‌
పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా

Jayam Ravi’s ‘Siren’ Teaser released by Successful Producer Dil Raju

Home Movie Makers Sujatha Vijaykumar’s ‘Siren’, features Jayam Ravi as the protagonist, and is directed by debutant Antony Bhagyaraj. The film’s teaser has been released by Successful Producer Dil Raju Today.

Actor Jayam Ravi has been creating waves of sensation in the Tamil Industry with back-to-back successful movies and is now appearing with salt and pepper look for the first time in his career.

Right from its point of commencement, Siren has been generating a strong buzz that includes the riveting first look of an ambulance with a siren followed by the revealing of Pre-Face Look, where Jayam Ravi’s salt ’n’ pepper avatar as the prisoner turned the spotlights on. Now the teaser shows Jayam Ravi’s character getting released from prison on parole.

The teaser showcases narratives of the story premise by two characters – A prisoner (played by Jayam Ravi) and a police inspector (played by Keerthy Suresh). The dramatic events with twists and thrills in the teaser have elevated the expectations of the film.

Antony Bhagyaraj, exhibiting his writing prowess in movies like Irumbu Thirai, Viswasam, Hero, and many movies is debuting as a filmmaker through this movie.

The film, produced at a grand scale with a heavy budget, is a family entertainer laced with action and thriller elements. Jayam Ravi, for the first time, will be seen in a never-seen-before character that appears in two different looks. Keerthy Suresh is pairing opposite Jayam Ravi for the first time in this movie. Yogi Babu, apart from tickling our funny bones with his hilarious avatar, has a promising character role in this movie. Furthermore, Samuthirakani will be seen appearing in a prominent character.

With the shooting wrapped up and post production work nearing completion, the official announcement on the film’s audio, trailer, and worldwide theatrical release will be made soon.

TECHNICAL CREW

Banner: Home Movie Makers
Producer: Sujatha Vijay kumar
Co-Producer: Anusha Vijay kumar
Music: GV Prakash Kumar
DOP: Selva Kumar SK
Editor – Ruben
Production Designer – Kadhir K
Art Director – Sakthee Venkatraj M
Choreography – Brinda
Costume Designers – Anu Parthasarathy, Archa Mehta, Nithya Venkatesan, Jefferson T
Executive Producer – Omaar
Production Executive – Sakkarathalvar G
Promotions Head – Shiyam Jack
PRO – Vamsi Kaka

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest