జీపు బోల్తా కొట్టడంతో ఏడుగురు మృతి

కటక్‌: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన జీపు బోల్తా కొట్టడంతో ఏడుగురు మృతి చెందిన ఘటన పరమానికి పూర్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్సుగూడ ప్రాంతానికి చెందిన 8 మంది జీపులో సంబల్పూర్‌లో జరిగిన పెళ్లి విందులో పాల్గొని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పరమానికి పూర్ వద్ద ఉన్న ఏటి కాలువలోకి జీపు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. దీంతో జీపులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అందరూ ఒకే గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest