‘జీ5’లో స్ట్రీమింగ్ అవుతున్న ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్ వెబ్ ఫిల్మ్ ‘ప్రేమ విమానం’

అక్టోబర్ 13న ‘జీ5’లో స్ట్రీమింగ్ అవుతున్న ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్ వెబ్ ఫిల్మ్ ‘ప్రేమ విమానం’

భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్ రూపొందిస్తోన్న ‘పేమ విమానం’ అనే వెబ్ ఫిల్మ్ అక్టోబర్ 13న ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమైంది.ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనింగ్ వెబ్ ఫిల్మ్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు చిన్న పిల్లలు .. కొత్త జీవితం కోసం విమానం ఎక్కి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకునే ప్రేమ జంట.. వీరితో ముడిపడిన జీవితాల్లో జరిగిన ఘటనలు.. వారి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ సినిమా ఆసక్తిని పెంపొందించాయి.

సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ ఫిల్మ్‌కి సంతోష్ కటా దర్శకత్వం వహించగా.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా పని చేశారు.

నటీనటులు : సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా తదితరులు

సాంకేతిక బృందం

సమర్పణ : దేవాన్ష్ ; నామా నిర్మాత : అభిషేక్ పిక్చర్స్, జీ5 ; నిర్మాత : అభిషేక్ నామా; దర్శకత్వం : సంతోష్ కటా; సంగీత దర్శకుడు : అనూప్ రూబెన్స్; సినిమాటోగ్రాఫర్ : జగదీష్‌ చీకటి; ఎడిటర్ : అమర్ రెడ్డి; ఆర్ట్ డైరెక్టర్ : గంధి నడికుడికర్; సీఈఓ : వాసు పోతిని; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మోహిత్ రాల్యని, పి.ఆర్.ఒ: సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).

జీ5 గురించి

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలి ఇలా ఇతర భాషల్లో ఉన్న గొప్ప కంటెంట్‌ను జీ5 నిత్యం ఆడియెన్స్‌కు అందిస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా జీ5కి మంచి కంటెంట్ అందిస్తుందనే పేరు ఉందన్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మీద నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన లూసర్ 2, బీబీసీ స్టూడియో, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన గాలివాన, రెక్కి, హలో వరల్డ్, మా నీళ్ల ట్యాంగ్, అహనా పెళ్లంట, ఏటీఎం, పులి మేక వంటి ఎన్నో మంచి వెబ్ సిరీస్‌లను జీ5 అందించింది. ఇదే కోవలో అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి ‘ప్రేమ విమానం’ అనే వెబ్ ఫిల్మ్‌ను రూపొందించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest