- 23న చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరనున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ?
- సత్తెనపల్లి టికెట్ హామీ ఇచ్చిన టిడిపి నాయకత్వం?
- హైదరాబాద్
బిజెపికి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు .ఆ మేరకు ఆయన తన అనుచరులతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే .ఈనెల 23న మాజీ సీఎం టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆయనకు సత్తెనపల్లి సీటు ఇచ్చేందుకు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అంగీకరించినట్టు తెలుస్తోంది .కన్నా టిడిపిలో చేరిన తర్వాత ఆయన వెంట మరికొందరు బిజెపి సీనియర్ నేతలు కూడా టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
Post Views: 144