టీచర్స్ ఎమ్మెల్సీ 2వ రోజు 3 నామినేషన్లు

 

హైదరాబాద్

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు 3 నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో దేవన్నగిరి మల్లారెడ్డి, గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, గుర్రం చెన్నకేశవ రెడ్డి లు ఒక్కొక్క సెట్టు నామినేషన్లు టీచర్స్ ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా కి అందజేశారు. ఇప్పటి వరకు 6 గురు అభ్యర్థులు మొత్తం 9 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి తెలిపారు.

హైదరాబాద్ లోకల్ అథారటీ ఎన్నికకు రెండవ రోజు కూడా ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా తెలిపారు.

ప్రభుత్వ సెలవు దినాలలో నామినేషన్లు స్వీకరించబడవు

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం, హైదరాబాద్ లోకల్ అథారటీ నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినాలలో నామినేషన్లను స్వీకరించబడవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికల సంఘం సూచన మేరకు ఈ నెల 18, 19 తేదీలలో (శని, ఆదివారం) ప్రభుత్వ సెలవులు ఉన్నందున నామినేషన్లు స్వీకరించబడవు అని రిటర్నింగ్ అధికారి తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest