టీటీడీ ఉద్యోగులకు జీవనశైలి మార్పులపై అవగాహన

11 నుంచి 13 వరకు టీటీడీ ఉద్యోగులకు జీవనశైలి మార్పులపై అవగాహన సదస్సు

తిరుపతి : శ్వేత ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు టీటీడీ పురుష ఉద్యోగులకు జీవనశైలిలో మార్పుల ద్వారా ఆరోగ్యంగా జీవించడం అనే అంశంపై అవగాహన సదస్సు జరగనుంది. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో నిపుణులైన డాక్టర్లు పాల్గొని అనారోగ్యానికి దారి తీస్తున్న అలవాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య చికిత్సలు తదితర అంశాలను తెలియజేస్తారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest