విజయవాడ:
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇక లేరు. గతకొన్ని రోజులుగా గుండె సంబంధిత ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్సీ మృతి పట్ల తెలుగు దేశం పార్టీ నేతలు ప్రఘాడ సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రఘాడ సంతాపాన్ని తెలిపారు.
అమరావతిలో జరగాల్సిన టీడీపీ జోన్ -3 సమీక్షా సమావేశం వాయిదా
టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతికి సంతాపం తెలుపుతూ రేపు అమరావతిలో జరగాల్సిన తెలుగుదేశం పార్టీ జోనల్ స్థాయి (జోన్ -3 ) సమీక్షా సమావేశం వాయిదా వేయటం జరిగింది.
కింజరాపు అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు గారి మృతి సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను.నిజాయితీకి మారుపేరు, అజాతశత్రువు అయిన అర్జునుడు గారు టిడిపి బలోపేతానికి ఎనలేని కృషి చేశారు. వారు కన్నుమూయడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ఆయన స్మృతిలో నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
నారా లోకేష్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి