డీప్ ఫేక్ లపై రాష్ట్రపతి పోలీసులకు ఆదేశాలు

న్యూఢిల్లీ :

దిల్లీ నేరగాళ్లు కృత్రిమ మేధ (ఏఐ) వినియోగించడం , డీప్ ఫేక్ లను ప్రయోగిస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంలో ఎప్పటికప్పుడు ఆప్ డేట్ కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. రాష్ట్రపతి భవన్ లో తనను 2022 బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్లను ఆమె ప్రసంగించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం వంటి సవాళ్లను పోలీసు ఎదుర్కొంటున్నారని సూచించారు. ” సాంకేతిక పరిజ్ఞానం , సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల పరిణామాలు వేగంగా మారిపోతుంటాయి.జెనరేటవ్ ఏఐని నేరగాళ్లు ఉపయోగిస్తున్నారు.డీప్ ఫేక్ వంటి సమస్యలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. అందువల్ల పోలీసు అధికారులు సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకోవాలి. నేరగాళ్లపై పైచేయి సాధించాలి అని రాష్ట్రపతి ద్రౌపది సూచించారు. దేశ పోలీసు వ్యవస్థలో ఏకరూపత కోసం ఐపీఎస్ అధికారులు కృషి చేస్తున్నారన్నారు. ఆర్ధిక సామాజిక అభివృద్దికి శాంతి భద్రతలకు బలోపేతం చేయాల్సిన ఎంతైనా అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest