ప్రముఖ నటుడు అలీ.. తారకరత్న శివేకం చెందడం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. తారకరత్న సినీ కెరీర్ ప్రారంభం నుంచి అలీ గారితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. తారకరత్నతో అలీ నాలుగు చిత్రాల్లో కలిసి నటించారు. తారకరత్న చివరి పెద్ద సినిమా ఎస్ 5 చిత్రంలో కూడా అలీ నటించారు. తనకు ఎంతో సన్నిహితుడైన తారకరత్న ఇలా అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం తన మనసును తీవ్రంగా కలచవేసింది అని అలీ బాధ పడుతూ చెప్పారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని అలీ వేడుకున్నారు.
అలీ తమ్ముడు ఖయ్యూం కూడా తారకరత్న మరణం తనను తీవ్రంగా బాధించింది అని, తాను నేను బావా బావా అని పిలుచుకునే వాళ్ళం అని, తారకరత్న చాలా మంచి వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి ఇలా జరగడం దారుణం అని ఖయ్యూం తెలియజేశారు.
Post Views: 53