తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును పునరుద్ధరించాలి

  • కళాక్షేత్రం వద్ద సాహితీ కళా సంస్థలు సామాజిక ఉద్యమకారుల నిరసన

 

విజయవాడ

విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును యధావిధిగా పునరుద్ధరించాలని అనేక సాహితీ కళా సంస్థలు సామాజిక ఉద్యమకారుల నిరసన కార్యక్రమం బుధవారం స్థానిక విజయవాడ కళాక్షేత్రం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజానాట్యమండలి, జన సాహితీ,జాషువా సాంస్కృతిక వేదిక, జన చైతన్య వేదిక, రంగం సాంస్కృతిక సంస్థ, తో పాటు అనేక సంస్థల సామాజిక ఉద్యమకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ కార్యక్రమానికి ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ అధ్యక్షతన జరగగా,జన సాహితి నాయకులు దివి కుమార్, ప్రముఖ సామాజిక ఉద్యమకారులు టి లక్ష్మీనారాయణ, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరెడ్డి,రవితేజ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చెన్నం పెంచలయ్య జాషువా సాంస్కృతిక వేదిక నాయకులు నారాయణ ,రాజు సుబ్బారెడ్డి ప్రజానాట్యమండలి అప్పన్న,రంగం సాంస్కృతిక సంస్థఅధ్యక్షులు రాజేష్ బొబ్బిళ్ళపాటి సాయి ప్రజానాట్యమండలి పిచ్చయ్య, లంకా దుర్గారావు నజీర్,భాస్కరరావ,సూరిబాబు, తదితరులు ప్రభుత్వ తీరును నిరసించారు. ఈ సందర్భంగా టి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎంతో చరిత్ర నేపథ్యం కలిగిన స్థల దానం చేసిన తుమ్మలపల్లి వారి పేరును లేకుండా చేయటం అలాగే ప్రముఖ వాగ్గేయకారులు క్షేత్రయ్య పేరును లేకుండా చేయడం పట్ల నిరసన కారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న కళాక్షేత్రం పేరును మార్చడం తగదన్నారు. జరిగిన తప్పిదాన్ని విజయవాడ మున్సిపల్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని వారి ఇరువురి పేర్లతో కళాక్షేత్రం పేరును ప్రాంగణ పరిధిలో ఏర్పాటు చేయాలన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ కళాక్షేత్రం కోసం స్థల దానం చేసిన తుమ్మలపల్లి వారు ఎంతో త్యాగంతో స్థలాన్ని ఇవ్వడంతో పాటు నిధిని కూడా సమీకరించారన్నారు వారి ఇరువురి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతోకాలంగా ఈ అంశం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారని నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులకు సాహిత్య సంస్థలకు అందుబాటులో లేని విధంగా కళాక్షేత్రం అద్దె ఉండటం వలన కళా ప్రదర్శనలకు నోచుకోవడం లేదని అన్నారు. ఆనాడు తుమ్మలపల్లి వారు కళా ప్రదర్శనల కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చి తక్కువ మొత్తంలో అద్దె వసూలు చేసి కళలు ప్రదర్శించుకునేటట్టుగా ఒక విశాలమైన ఆలోచనతో వారు చేస్తే దానికి భిన్నంగా ప్రభుత్వాలు సంకుచితమైన ధోరణితో వ్యవహరిస్తున్నాయన్నారు ఇప్పటికైనా చరిత్రకారులను అగౌరవపరచకుండా నాటక సాహిత్య సాంస్కృతిక సంస్థలను ప్రోత్సహించే విధంగా విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం అందుబాటులోకి ఉండేటట్లుగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.అనంతరం కళాక్షేత్రం అధికారి అంబెడ్కర్ ను కలిసి సమస్యలు విన్నవించడం జరిగింది. వెనువెంటనే కళాక్షేత్రానికి సంపూర్ణంగా తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును పునరుద్ధరిస్తామన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest