తెలంగాణలో మోడీ రెండు రోజుల పర్యటన

న్యూ ఢిల్లీ :
ప్రధాని మోడీ సోమవారం తెలంగాణకు రానున్నారు. రెండు రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో పీఎం మోడీకి తెలంగాణ పర్యటనకు సంబంధించి బీజేపీ అధిష్టానం షెడ్యూల్‌ విడుదల చేసింది.

4వ తేదీ మోడీ షెడ్యూల్..

* సోమవారం ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు అదిలాబాద్‌లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవం లో మోడీ పాల్గొననున్నారు.
* 11.15 గంటల నుండి 12 గంటల వరకు పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తారు.
* మధ్యాహ్నం తమిళనాడు వెళ్లి.. తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.
* సోమవారం రాత్రి రాజ్ భవన్ లో బస చేయనున్నారు.

5వ తేదీ షెడ్యూల్..

మంగళవారం ప్రధాని మోడీ సంగారెడ్డిలో పర్యటించనున్నారు.
* ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి మోడీ బయలుదేరుతారు.
* 10. 45 నుండి 11.15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
* 11.30 నుండి 12.15 వరకు బీజేపీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
* తెలంగాణ పర్యటన అనంతరం ప్రధాని మోడీ ఒడీశాకు వెళ్లనున్నారు.

15 వేల 718 కోట్లతో అభివృద్ధి పనులు..

ఈ పర్యటనలో ప్రధాని మోడీ మొత్తం 15 వేల 718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేయనున్నారు. రూ. 6,697 కోట్లుతో ఆదిలాబాద్ లో, రూ. 9,021 కోట్ల సంగారెడ్డిలో ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అలాగే బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రధాని మోడీ ఈ పర్యటలో భాగంగా ప్రారంభిస్తారు. లింగంపల్లి నుండి ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ ను సేవలనుప్రారంభించనున్నారు. వీటితో పాటు ఎన్టీపీసీని కూడా ప్రారంభించనున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు మోడీ తెలంగాణలో పర్యటన చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest