తెలుగు సినీ వైభవం ప్రపంచవ్యాప్తంగా తెలిసింది: కేతిరెడ్డి

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో భాగమైన తెలుగు చలనచిత్ర పరిశ్రమ వైభవం ప్రపంచానికి నేడు తెలిసిందని  దర్శకదిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ చిత్రం లోని నాటు నాటు అనే పాట నేడు బేస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ సాధించటం ఇది తెలుగోడి విజయమని ,తెలుగోడి దెబ్బా అబ్బ అనే విధంగా చాటిన రచయిత చంద్రబోస్ కు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కి.దర్శకుడు రాజమౌళి కి.నిర్మాత దానయ్య కు ,ప్రేమ్ రక్షిత్ కు ముఖ్యంగా ఆ పాటను అభినయించిన జూనియర్ ఎన్టీఆర్,రాంచరణ్ లకు తెలుగు వాడి కీర్తి కెరటాలను ప్రపంచవ్యాప్తంగా వేగరవేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ దినమని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు ,తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తన సంతోషం ను వేక్తం చేశారు ,
ఆయన ఆ ప్రకటన లో “”ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ ను మీరు అందుకున్న సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు, తెలుగు భాషను తెలుగు వారు మరచి పర బాష వ్యామోహం లో పడి మరచిపోతున్న సందర్భంలో తెలుగు సాహిత్యం ను ప్రపంచ0 గుర్తించినదని ఇక నేనా నేటి యువతరం తెలుసుకొని బాష పట్ల ప్రేమాభిమానాన్ని పెంచుకోవాలని ,ప్రస్తుతం దక్షిణాది చలనచిత్ర పరిశ్రమ అటు సాంకేతిక పరంగా ,ఇటు నూతన కధ లను ,సాహిత్యం ను,సంగీతం ను కొత్త పంథాలో నడుస్తూ అగ్రగామిగా ఉందని,ఈ ఆస్కార్ గతంలో సంగీత దర్శకుడు ఏ. ఆర్.రెహమాన్, సౌండ్ విభాగం లో రసూల్ కుట్టి సాధించరని ,అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి భిన్నంగా ఉన్నదని , ఏది ఎమీ అయ్యినప్పటికి  భారత చలనచిత్ర పరిశ్రమ వేభవం ఇలాగే కొనసాగాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు
Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest