దళితుల ఓట్లకు కేటీఆర్ గాలం-డిక్కీ తో భేటీ

 

హైదరాబాద్,
తెలంగాణ లో ఎన్నికలు జరుగుతున్న వేల దళితుల ఓట్లకు కేటీఆర్ గాలం వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం డిక్కీ ప్రతినిధులతో కేటీఆర్ పార్క్ హయత్ లో భేటీ అయ్యారు. తొమ్మిదిన్నరెళ్ళలో మంచి చేశాం మళ్ళీ మేమే గెలుస్తాం. కుల వ్యవస్థ ఉండకూడదని కోరుకున్న వ్యక్తి అంబేడ్కర్. దళిత బంధు ద్వారా లబ్ధిదారులకు లబ్ది చేకూరాలి. అందరూ వాహనాలు కొంటున్నారు. అలా కాకుండా బిజినెస్ పెట్టించాం. దానివల్ల డబ్బులు రొటేట్ అవుతాయి. లాభాలు వస్తాయి. ప్లాన్ తో ముందుకెళ్లాలి. దళిత బంధు వంద శాతం సక్సెస్ చేసి చూపిస్తే దేశం లో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది. కేసిఆర్ అప్పులు చేస్తున్నాడు అని ప్రతిపక్షాలు అంటున్నాయి.FRBM లో 32 రాష్ట్రాల్లో తెలంగాణ లాస్ట్ నుంచి 5 స్థానం లో ఉంది. మన పైన 26రాష్ట్రాలు ముందు ఉన్నాయి అప్పులు చేయటంలో మనం తీసుకున్న అప్పులు కరెంట్, సాగునీటి ప్రాజెక్టు లు కట్టడానికి ఉపయోగించాం. 40 వేల కోట్లతో మంచి నీళ్ళ కోసం ఖర్చు చేశాం.ధాన్యం ఉత్పత్తి లో 14వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 1వ స్థానంలో ఉంది.మనం చేసింది అప్పు కాదు అది పెట్టుబడి మాత్రమే అని కేటీఆర్ అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest