దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా-ఏపీ అసెంబ్లీ తీర్మానం

అమరావతి :

ఆంధ్రప్రదేశ్ లో దళిత క్రిస్టియన్లకు ఎస్సి హోదా కల్పించాలని అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. దీంతో దళిత క్రిస్టియన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇదే తీర్మానాన్ని 2019లోనే తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రానికి పంపించింది అని తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు.
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని టిడిపి ప్రభుత్వం 2019 లోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దళిత క్రిస్టియన్లు మతం మారినప్పటికీ వారి సామాజిక ఆర్థిక పరిస్థితులలో మాత్రం మార్పు లేదని చంద్రబాబు నాయుడు గతంలోనే గుర్తించారు. ఆ మేరకు టిడిపి ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలోనే దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని, అందుకు పార్లమెంటులో చట్టం చేయాలని శాసనసభలో తీర్మానించి కేంద్రానికి పంపడం జరిగింది. అంతేకాకుండా 2019 టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. అని తెలుగుదేశం నాయకులు నక్క ఆనంద బాబు, డోలా బాలా వీరాంజనేయ స్వామి మండి పడ్డారు.

కానీ జగన్ రెడ్డి నేడు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని శాసనసభలో తీర్మానించడం హాస్యాస్పదంగా ఉంది. ఈ చర్యతో జగన్మోహన్ రెడ్డి మరోసారి స్టిక్కర్ సీఎం అని నిరూపించుకున్నాడు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఓవైపు దళితులపై దాడులు చేయిస్తూ, మరోవైపు ఉద్దారకుడిలా నటిస్తూ దళితులను మోసం చేయాలని చూస్తోంది. జగన్ రెడ్డి పాలనలో దళిత ఎమ్మెల్యేలకే రక్షణ కరువైంది. ఇక సామాన్య దళితుల పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా ఉంది. దళితులపై అధికార పార్టీ నాయకుల బెదిరింపులు, డమనకాండలు, దాడులు, హత్యలు నిత్యకృత్యాలు అయ్యాయి. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో దళితులపై ఏడు వేలకు పైగా దాడులు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ రెడ్డి ఘోర వైఫల్యం చెందడంతో దళిత క్రిస్టియన్ల ఎస్సీ హోదాను ఒక ఎన్నికల స్టంట్ గా శాసనసభలో ప్రవేశపెట్టాడు. అంతేతప్ప, జగన్ రెడ్డికి దళితులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే జగన్ రెడ్డి ఇటువంటి స్టంట్ట్లు చేస్తున్నాడు. జగన్ రెడ్డి ఎన్ని స్టంట్ లు చేసినా ఈ సారి మోసపోవడానికి దళితులు సిద్ధంగా లేరు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest