హైదరాబాద్ :
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిగివచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ను ఆహ్వానించకుండానే సమావేశాలు ముగిద్దామనుకున్నారో ఏమోగానీ ప్రభుత్వమే కోర్టు మెట్లు ఓ మెట్టి దిగాల్సిన పరిస్థితి నెలకొంది. బడ్జెట్ ఆమోదం కోసం గవర్నర్ దగ్గరికి వెళ్లిన ఫైల్ పై గవర్నర్ సంతకం చేయకపోవడంతో ప్రభుత్వమే కోర్టులు మెట్లెక్కింది. చివరికి ఫిబ్రవరి 3 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానిస్తామని కోర్టుకు చెప్పింది. ముందుగా ఫిబ్రవరి 3న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 3న గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 4న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతు తీర్మానం ప్రవేశ పెడతారు. ఫిబ్రవరి 6వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టె అవకాశం కనిపిస్తోంది.
Post Views: 164