సినీ, రాజకీయ అతిరద మహారదుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ అయిన సందేశాత్మక చిత్రం “అవసరానికో అబద్దం”
మనిషి జీవితంలో నిజానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అబద్దానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని చెప్పే సందేశాత్మక చిత్రమే “అవసరానికో అబద్దం”. శ్రీమతి ఝాన్సీ, శ్రీ కృష్ణమూర్తి యలమంచిలి సమర్పణలో గ్లోబల్ ఎంపవర్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డాక్టర్ శివకుమార్ చికిన సహకారంతో త్రిగున్, రుబాల్ షేక్ రావత్ జంటగా ఆయాన్ బొమ్మాళిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ జై యలమంచిలి నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియోలో వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సురేష్ బాబు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ దామోదర్ కోలేటి, చిత్ర నిర్మాత తమ్ముడు రమేష్ యలమంచిలి, విజయవాడ తూర్పు వై. సి. పి. ఇంచార్జ్ దేవినేని అవినాష్, ఆంధ్రప్రదేశ్ బి. జే. పి సెక్రటరీ నాగభూషణం పాతూరి, బి. జే. పి నేషనల్ ఫైనాన్సియల్ స్పోక్ పర్సన్ లంకా దినకర్, రాజేంద్ర ఎనిగల్ల, శంకర్ చెన్నం శెట్టి చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాత సురేష్ బాబు గారు గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
చిత్ర దర్శకుడు ఆయాన్ బొమ్మాళి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో అబద్ధం అనేదానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎంతగా అంటే చిన్నప్పుడు గోరుముద్దలు తినకపోతే బూచోడు ఎత్తుకు పోతాడు అని అమ్మ చెప్పే అబద్దం నుండి,మనం చనిపోయేముందు మనం బెడ్ మీద ఉన్నప్పుడు కూడా డాక్టర్ వచ్చి నీకేం కాదని చెప్పే దైర్యం వరకు, మనిషి జీవితంలో అబద్దానికి చాలా ఇంపార్టెంట్స్ ఉందని చెప్పే సందేశాత్మక చిత్రమే “అవసరానికో అబద్దం”.అలాగే మహాభారతంలో శ్రీ కృష్ణుడు కొన్ని సందర్భాల్లో అబద్దం ఆడవచ్చు అని చెప్పాడు. దానిని ఆదర్శంగా తీసుకొని కమర్శియల్ వేలో సినిమాటిక్ గా సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఐడియాతో చేసిన కథ ఇది.ధర్మం కాపాడాలి అంటే ధర్మ రాజు తోనే అబద్ధం ఆడించాలనే స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరోది. మణిశర్మ గారు మా సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథతో చేస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల వారికీ కచ్చితంగా నచ్చుతుంది. అన్నారు.
చిత్ర నిర్మాతలు కృష్ణమూర్తి యలమంచిలి, డాక్టర్ జై యలమంచిలి మాట్లాడుతూ.. మా సినిమాని బ్లెస్స్ చేయడానికి వచ్చిన నిర్మాత సురేష్ బాబు గారికి, దామోదరప్రసాద్ గారికి, దిల్ రాజు గారికి, దామోదర్ పోలేటి గార్లకు, నాగభూషణం గారికి ఇంకా మమ్మల్ని బ్లెస్స్ చేయడానికి వచ్చిన అందరికీ మా ధన్యవాదాలు. తెలుగు ఇండస్ట్రీ కి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళు. వవీరే కాకుండా యస్. వి. రంగారావు గారు, కె. విశ్వనాధ్ గారు, కెవి. రెడ్డి, సి. నారాయణ రెడ్డి, దాసరి నారాయణ గారు, రాఘవేంద్ర రావు గారు వారి తరువాత తరం వారు చేసిన కృషి వల్లే ఈ రోజు చిత్రసీమ ఇంత డెవలప్ అయ్యింది. సినిమా అంటే నాకు చాలా ఇష్టం.ఇదే సినిమా ఇండస్ట్రీలో నేను పెరిగిన వాణ్ని. ఏ టెంపుల్ కు వెళ్లినా, చర్చి కి వెళ్లినా మసీద్ కు వెళ్లినా అందరూ ధర్మో రక్షిత రక్షితః అంటాము. ధర్మాన్ని గెలిపించాలి అనే ఒక ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ ఒక మంచి ప్రయత్నం “అవసరానికో అబద్ధం”. ఈ సినిమాకి నాంది పలికింది దర్శకుడు బొమ్మాళి. తను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రేక్షకులకు కావలసిన అంశాలు అన్ని ఇందులో ఉంటాయి. సినిమాకు తగ్గట్టు మంచి ఎనర్జీటిక్ ఉన్న హీరో, హీరోయిన్ లతో పాటు ఎగ్జిగ్గ్యూటర్ వెంకటేష్ ఆధ్వర్యంలో మాకు మంచి టెక్నిషియన్స్ లభించారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
చిత్ర హీరో త్రిగున్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు చాలా క్రాస్ జోనర్ సినిమాలు చెయ్యడం జరిగింది. అలాగే దర్శకుడు ఆయాన్ బొమ్మాళి చెప్పిన కథ చాలా డిఫరెంట్ గా అనిపించిడంతో ఈ సినిమా చేస్తున్నాను.మా గురువు గారు మణి శర్మగారు నాకు 2022 లో పదములే లేవు పిల్ల వంటి బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చాడు. మళ్ళీ తను ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సాంగ్ ఇస్తాడని కోరుకుంటున్నాను. మా నిర్మాత డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారికి సినిమా అంటే ప్యాషన్. మంచి కథను సెలెక్ట్ చేసుకోని తీస్తున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు వారికి, దర్శకులు బొమ్మాళి కి నా ధన్యవాదములు అన్నారు.
చిత్ర హీరోయిన్ రుబాల్ షేక్ రావత్ మాట్లాడుతూ..ఇలాంటి మంచి సినిమాలు చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములున్నారు
నటీ, నటులు
త్రిగున్,రుబాల్ షేక్ రావత్ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : గ్లోబల్ ఎంపవర్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాత : డాక్టర్ జగదీష్ యలమంచిలి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్ : ఆయాన్ బొమ్మాలి
మ్యూజిక్ మణిశర్మ
సినిమాటోగ్రాఫర్ ::సిహెచ్ మోహన్ చారి
ఎడిటర్ : జానకిరామ్
లిరిక్స్ : అనంతశ్రీరామ్
ఆర్ట్ : హేమంత్ కుమార్ జి
పి. ఆర్. ఓ : హరీష్, దినేష్
‘Avasraniko Abaddam’ formally launched at Ramanaidu Studios
Upcoming movie titled ‘Avasraniko Abaddam’ starring Thrigun and Rubal Shekawat in the lead, was formally launched with a puja ceremony here at Ramanaidu Studios on Friday.
Lies have as much importance as truth in a man’s life. ‘Avasaraniko Abhadham’ is a quirky take on a man’s life. Presented by Jhansi and Krishnamurthy, the film is being produced by Dr. Jagadish Yalamanchili under the banner of Global Empower Broadcasting Pvt. Ltd.
Starring actors Trigun and Rubal Shekawat in the lead, the film is introducing Ayaan Bommalee as a director.
Telangana Minister of Cinematography Talasani Srinivas Yadav, producer Dil Raju, President of Telugu Producers Council Damodar Prasad, producer Suresh Babu and Housing Corporation Damodar graced the event as chief guests.
Producer Dil Raju gave a clap for the momentous scene shot after the puja ceremony while the president of the Telugu Producers Council Damodara Prasad switched on the camera. Produced by Suresh Babu and directed by Gaurav took part in honorary direction.
Speaking on the occasion, debutante Ayan Bommali said the word lie has a lot of importance in everyone’s life. “So much so that since childhood everyone possibly witnessed how a mother lies to her child while she struggles to feed the baby. Even on the death bed, doctor would tell you that nothing is going to happen to you. So the word plays a significant part in our lives. ‘Avasaraniko Abaddam’ is an informative film that tells us that lies are very important in human life. Similarly, in the Mahabharata, Lord Sri Krishna had to lie in a few instances. Inspired from the epic texts, the story is woven in a cinematic way by taking commercial elements into consideration. The hero is a strong character who makes king of Dharma lie to uphold Dharma. We’re grateful to have Mani Sharma garu in our film. This movie is made with a good story and will definitely be liked by all section of audiences.”
Producer Dr. Jagdish Babu Yalamanchili thanked Minister Talasani Srinivas Yadav and the producers who have attended the event as chief guests. “Today, Telugu film industry has developed so much because of the efforts made by legendary stars like NT Ramarao and Akkineni Nageswara Rao. I like cinema a lot. I grew up in this film industry. Whether we go to any temple, church or masjid, we all say ‘Dharma Rakshita Rakshitah’. With an intention to uphold dharma is, we’ve made this flick ‘Avasraniko Abaddam’.
Speaking on the occasion, lead actor Thrigun said, “So far, I’ve done so many cross-genre films. Also, I am doing this film because the story narrated by Ayaan Bommalee. At the very first narration, I was bowled over by the idea. I felt it has so much freshness and unique storyline. My teacher Mani Sharma garu has given me a blockbuster song like ‘Padamule Lai Pilla’ in 2022. Again I wish he will give a blockbuster song for this movie too. Cinema is passion for our producer Dr. Jagdish Babu Yalamanchili. Thanks to director Bommali for this amazing story.”
Post Views: 146