‘ధీర’ నుంచి అధరం మధురం సాంగ్ రిలీజ్

 

లక్ష్ చదలవాడ ‘ధీర’ నుంచి అధరం మధురం బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్

ఎన్నో పాటలు వస్తుంటాయి కానీ అందులో కొన్ని మాత్రమే సంగీత ప్రియుల మనసు దోచుకుంటూ దశాబ్దాల పాటు సూపర్ హిట్ ట్రాక్ లో వెళ్తుంటాయి. అలాంటి టార్గెట్ పెట్టుకొని యంగ్ హీరో లక్ష్ చదలవాడ ‘ధీర’ మూవీ నుంచి ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. అధరం మధురం.. వధనం మధురం.. నయనం మధురం అంటూ యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే ట్యూన్ తో సాగిపోతున్న ఈ పాటలో ప్రతి సీన్ అద్భుతంగా వచ్చింది.

ప్రేయసి ఆలోచనలు, జ్ఞాపకాలతో ప్రియుడి ఘాడమైన ప్రేమను వ్యక్తపరుస్తూ బాలాజీ రాసిన లిరిక్స్ సంగీత ప్రియుల మనసు దోచుకుంటున్నాయి. అనురాగ్ కులకర్ణి, ML శృతి ఆలపించిన తీరు ఎంతో ఆకర్షిస్తోంది. హీరోహీరోయిన్లపై షూట్ చేసిన సన్నివేశాలు, రొమాంటిక్ మూమెంట్స్, హీరో లక్ష్ చదలవాడ డాన్స్ ఈ పాటకు మేజర్ అసెట్స్ అని చెప్పుకోవచ్చు. లిరిక్స్‌కి తగ్గట్టుగా సాయి కార్తీక్ కట్టిన బాణీలు ఈ సాంగ్ లెవల్ పెంచేశాయి. టోటల్ గా చూస్తే ఈ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ తో ధీర సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్.

కెరీర్ ఆరంభం నుంచే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న హీరో లక్ష్ చదలవాడ.. రీసెంట్ గా ‘వలయం’, ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు అదే జోష్ లో ‘ధీర’ అనే మరో ప్రాజెక్టులో భాగమవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ యూత్ ఫుల్ యాక్షన్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.

విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ధీర సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కోరుకునే ఆసక్తికర సన్నివేశాలతో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు చిత్ర ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టిన దర్శకనిర్మాతలు.. ఎప్పటికప్పుడు ఈ మూవీపై అంచనాలు పెంచుతున్నారు.

ఈ చిత్రంలో లక్ష్ చదలవాడ, నేహా పతన్, సోన్యా భన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడీ, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని, త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాం అని తెలిపారు మేకర్స్. పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు. ధీర సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్ డేట్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. దీంతో సినిమా విజయంపై దర్శకనిర్మాతలు ఎంతో నమ్మకంగా ఉన్నారు.

సాంకేతిక నిపుణులు :
సమర్పణ : చదలవాడ బ్రదర్స్
బ్యానర్ : శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
నిర్మాత : పద్మావతి చదలవాడ
కథ, కథనం, దర్శకత్వం : విక్రాంత్ శ్రీనివాస్
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ : కన్నా పీసీ
డైలాగ్స్: విక్రాంత్ శ్రీనివాస్, శృతిక్
ఎడిటర్: వినయ్ రామస్వామి. వి
ఫైట్ మాస్టర్ : జాషువా, వింగ్ చున్ అంజి
పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest