ధోని లేకపోవడం వళ్లేనా… ఈ ఘోరం ?

 

అహ్మదాబాద్ , 19 నవంబర్ 2023

టీమ్ ఇండియా వరల్డ్ కప్ లో మహేంద్ర సింగ్ ధోని లేకపోవడం వల్లే ఇండియా ఓటమి చవిచూసిందనే వాదన వినిపిస్తోంది. క్రికెట్ చరిత్రలో కపిల్దేవ్ తరువాత ఇండియన్ కు కప్ తెచ్చిన క్రికెట్ దేవుడు ధోని. ఈ చరిత్ర ఇంకమారో అయిదేళ్లపాటు ఇలాగే వినిపిస్తూనే ఉంటుంది. ధోని చరిత్రను రోహిత్ శర్మ చెరిపెయ్యలేకపోయాడు. దీంతో ధోని టీమ్ లో లేకపోవడం వల్లే ఇండియా ఓడిపోయిందని వాదన బలంగా వినిపిస్తోంది. రోహిత్ శర్మ క్యాప్టెన్ గా తన విధులు సరిగ్గా నిర్వర్తించలేదని, ఆటగాడిగా కూడా ఫైనల్ లో ఆడాల్సిన ఆట ఆడలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గత వరల్డ్ కప్ లో ధోని ఆడిన తీరు, టీమ్ మేనేజ్మెంట్ చేసిన తీరును ఇప్పుడు రోహిత్ శర్మ టీమ్ మేనేజ్మెంట్ తీరును పోలుస్తూ చాలా మంది క్రికెట్ విశ్లేషకులు సోషల్ మీడియా లో వారివారి శైలిలో విశ్లేషిస్తున్నారు. ధోని టీమ్ లో ఉండి ఉంటె ఇంత ఘోరంగా ఓడిపోయేవాళ్ళం కాదని క్రికెట్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్ లోని అంబర్ పేట స్టేడియంలో వేలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ గుమిగూడి మ్యాచ్ తిలకించిన, చివరికి ఓడిపోవడంతో అందరూ బాధతో వెళ్లిపోయారు. ఓ మీడియా ప్రతినిధి లైవ్ ఇవ్వడానికి సైతం స్టేడియంలో ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ ప్రతినిధి చివరికి రోడ్డు మీద నిలబడి ఒక్కడే లైవ్ ఇవ్వాల్సి వచ్చింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest