నర్సులపై నోరుపారేసుకున్న బాలయ్య

హైదరాబాద్
ఆసుపత్రుల్లో రోగులకు సేవ చేసేది నర్సు. రోగం తనకు అంటుందేమోనని కూడా చూడకుండా సేవలు చేసే నర్సులపై బాలకృష్ణ నోరుపారేసుకున్నారు. అక్కినేని తిక్కినేని అనే వివాదం ముగిసిందో లేదో నర్సుల వివాదం తెరమీదకు వచ్చింది. ఆహ ఓ టి టి లో వస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పవన్ కళ్యాన్ తో చేసిన ఇంటర్వూ లో నర్సుల గురించి బాలయ్య నీచంగా మాట్లాడారు. ఆసుపత్రిలో కళ్ళు తెరవగానే అందమైన నర్సు కనిపించింది. అబ్బా అదేముంది అని వెటకారంగా మాట్లాడారు. దీంతో నర్సుల మనోభావాలు దెబ్బతిన్నాయి. బాలకృష్ణ ఇప్పుడు నర్సులకు క్షేమాపణ చెప్పాలని నర్సుల సంఘం డిమాండ్ చేస్తోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest