నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో కొమ్మినేని భేటీ

 

గుంటూరు :

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ పి.రాజశేఖర్ తో ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు భేటీ అయ్యారు. నూతనంగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి జర్నలిస్టుల కోసం ప్రారంభిస్తున్న డిప్లొమా ఇన్ జర్నలిజం కోర్సుకు సంబంధించిన సిలబస్ రూపకల్పన తదితర విషయాలపై వైస్ ఛాన్సలర్ పి.రాజశేఖర్ తో చర్చించారు. జర్నలిజంలో వస్తున్న అత్యాధునిక మార్పులకు అనుగుణంగా అందరికి అర్థమయ్యేలా సరళ తరమైన వాడుక భాషలో కొత్త సిలబస్ ని రూపకల్పన చేయాలని యూనివర్సిటీ అధ్యాపకులకు ప్రెస్ అకాడమి చైర్మన్ సూచనలు చేసారు. ఈ సంధర్బం గా ఎంబిఎ కోర్సులో మీడియా మేనేజ్ మెంట్ సబ్జెక్టు చేస్తున్నామని విసి తెలిపారు. అందుకు యూనివర్సిటీ వీసిని చైర్మన్ అభినందించారు. నాగార్జున యూనివర్సిటీ నిర్వహించబోతున్న ఎంబిఎ కోర్సులో మీడియా మేనేజ్ మెంట్ సబ్జెక్టు బాగుందని చైర్మన్ తెలిపారు. ఈ సమావేశంలో నాగార్జున యూనివర్సిటీ రిజిస్ట్రార్ బి.కరుణ, జర్నలిజం విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అనిత, ప్రొఫెసర్ ఈ.శ్రీనివాస్ రెడ్డి, యూనివర్సిటీ ర్యాంక్ కోఆర్డినేటర్ డా. బిఎస్ నాగకిషోర్ రెడ్డి లు పాల్గొన్నారు. ప్రెస్ అకాడమి సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసారు. జర్నలిజం ప్రొఫెసర్ బాబీవర్ధన్, అంబేద్కర్ యూనివర్సిటీ డైరెక్టర్ ఇన్చార్జ్ ఎల్వీకే రెడ్డి, ప్రొఫెసర్ సత్తిరెడ్డి, పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయలక్ష్మి, యోగివేమన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈశ్వర్ రెడ్డి, ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్ పి.సి వెంకటేశ్వర్లు, నాగార్జున యూనివర్శిటీ జర్నలిజం విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అనిత సిలబస్ కమిటీ సభ్యులుగా వున్నట్లు ప్రెస్ అకాడమి సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest