నియవ్వ ఎట్లైతే గట్ల గుండు గుత్తగా లేపేద్దాం బెంచద్ -నాని బూతు యాస

నాని హీరోగా నటించిన దసరా సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని చెప్పిన ఓ డైలాగు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
”నియవ్వ ఎట్లైతే గట్ల గుండు గుత్తగా లేపేద్దాం బెంచద్ ” ఇది చాలా బూతు పదం. తెలంగాణ యాసలో చెప్పే ఈ డైలాగుల్లో విపరీతమైన బూతు ఉంది. తెలంగాణ యాసను అవహేళన చేసినట్టు కూడా ఉంది.
తెలంగాణ రాష్ట్రము ఏర్పడక ముందు తెలంగాణ యాస ను విలన్లకు వినియోగించి అవమానపరిచే ఆంధ్ర సినిమా వాళ్ళు ఇప్పుడు ఏకంగా హీరోలకు తెలంగాణ యాస పెట్టి మరో రూపకంగా మన యాసను అవమాన పరుస్తున్నారు. తెలంగాణ యాస అంటే బూతు భాషగా మార్చేస్తున్నారు . తెలంగాణ యాస మాధుర్యం తెలియని ఈ ఆంధ్రా సినిమావాళ్లు తెలంగాణ యాసను అవమాన పరచడం సరైంది కాదని తెలంగాణ వాదులు అభిప్రాయపడుతున్నారు.

”నీది కాదురా పోరి ” అనే పాటను ప్రమోషన్ కోసం విడుదల చేశారు. ఈ ప్రమోషన్ లో భాగంగానే డైలాగు వీడియోను కూడా మార్కెట్ లో వదిలారు. ఈ డైలాగులోనే ‘బెంచద్ ” అనే బూతు పదం వాడారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest