నిర్మాతల సమస్యల పరిష్కారమే ఎజెండా:ప్రోగ్రస్సివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్ (PPP)

 

పదవులపై ఆశ లేదు, స్వప్రయోజనాలు లేవు*
నిర్మాతల సమస్యల పరిష్కారమే మా ఎజెండా

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతలకు ఓ విజ్ఞప్తి చేసింది. తాము పదవులు ఆశించి పోటీ చేయడం లేదని, సమస్యల పరిష్కారానికి వస్తున్నామని తెలియజేసింది. భావి తరాల కోసమే తాము అడుగులు వేస్తున్నామని వివరించింది.

గిల్డ్‌తో లాభమే
వరుసగా సినిమాలు నిర్మిస్తున్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్‌కు ‘తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి’లో జరుగుతున్న పరిణామాలు సరైనవి కాదనిపించి, బయటకు వచ్చి తమ సినిమాల పబ్లిసిటీ కోసం ఎల్ఎల్‌పి ప్రారంభించారు. ఈ క్రమంలో వ్యాపార కోణంలో వెళ్ళకూడదని, రన్నింగ్ ప్రొడ్యూసర్స్ సమస్యల పరిష్కారానికి ఒక వేదిక కావాలని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందరికీ ఉపయోగపడాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. సినిమాలు నిర్మించే వ్యక్తులు అందరూ గిల్డ్ వద్దకు వస్తారు. అందులో భాగంగా పబ్లిసిటీకి అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఉంటాయి. గిల్డ్ వల్ల చిత్ర పరిశ్రమకు ఉపయోగమే. దానితో ఎవరికీ నష్టం లేదు. అయితే, గిల్డ్ మీద చిత్ర నిర్మాణం ఆపేసిన కొందరు నిర్మాతలు ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒక్క తెలుగుకు మాత్రమే గిల్డ్ అనేది పరిమితం కాలేదు. హిందీ చిత్ర పరిశ్రమలో కూడా ఎప్పట్నుంచో గిల్డ్ ఉంది. ఫిక్కీ(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ)లో ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’కు సభ్యత్వం ఉంది. భారత ప్రభుత్వం వివిధ పరిశ్రమలకు  సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు ఫిక్కీని సంప్రదిస్తున్న విషయం తెలిసినదే.

రన్నింగ్ నిర్మాతలకు అవకాశం ఇస్తే…
ప్రస్తుతం తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న వారు 1200 మంది ఉన్నారు. సినిమాలు తీస్తున్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ 70 నుంచి 100 లోపు మాత్రమే. సినిమాలు తీస్తున్న నిర్మాతల సమస్యలు ఎక్కువ ఉంటాయి. నిర్మాణానికి దూరంగా ఉన్న వారి సమస్యలు వేరుగా ఉంటాయి. చిత్ర నిర్మాణం ఆపేసిన నిర్మాతలకు ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) ఇవ్వడం నిర్మాతల మండలిలో మొదలైంది. ఈ విధమైన పథకాలను కొనసాగిస్తూ, వాటిని ముందుకు తీసుకు వెళ్లడంతో పాటు రన్నింగ్ ప్రొడ్యూసర్స్ సమస్యల పరిష్కారానికి నిర్మాతల మండలి ముందుకు గిల్డ్ ఓ ప్రతిపాదన ఇచ్చింది. రన్నింగ్ నిర్మాతలకు నిర్మాతల మండలిలో చోటు కల్పించమని కోరింది.

రెండు మూడేళ్ళుగా సినిమాలు తీస్తున్న నిర్మాతలంతా మండలిలో ఉంటే సాధక బాధకాలు చర్చించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బైలాలో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు నిర్మాతలు అందరికీ ఉపయోగం ఉంటుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. నిర్మాతల మండలి ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి అందరికీ అందాలనేది గిల్డ్ ఆలోచన కూడా.

చర్చలు విఫలం కావడంతో ఎన్నికలకు!
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, నిర్మాతల మండలి మధ్య 2019లో ఓసారి చర్చలు జరిగాయి. అప్పుడు చర్చలు ఎందుకు విఫలం అయ్యాయనేది అందరికీ తెలుసు. ఇప్పుడీ ఎన్నికల సందర్భంగా ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్’ను నిర్మాతల మండలి నుంచి సి. కళ్యాణ్ గారు సంప్రదించారు. సమన్వయంతో ముందుకు వెళదామని ప్రతిపాదించారు. నిర్మాతల మండలి ఆహ్వానం మేరకు గిల్డ్ సభ్యులు అందరితో మాట్లాడిన ‘దిల్’ రాజు గారు సానుకూలంగా స్పందించారు. మొదట 70, 30 శాతంలో వెళ్ళడానికి అంగీకారం జరిగింది. చివరకు వచ్చేసరికి  నిర్మాతల మండలిలో పాతుకుపోయిన కొందరు బయటకు రావడానికి ఇష్టపడలేదు. అందువల్ల, ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది.

గిల్డ్ ఎన్నికలకు ఎందుకు రావాల్సి వచ్చింది?
ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈ క్షణం కూడా ప్రొడ్యూసర్స్ గిల్డ్ విత్ డ్రా కావచ్చు. అయితే, గిల్డ్ వల్ల చిత్ర పరిశ్రమకు సమస్యలు వస్తున్నాయని మండలిలో కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు.

చిత్ర నిర్మాణం ఆపేసిన నిర్మాతలకు కావాల్సిన ప్రయోజనాలు ఏంటి? ప్రస్తుతం సినిమాలు తీస్తున్న నిర్మాతలకు కావాల్సిన ప్రయోజనాలు ఏంటి? సమస్యలు ఏంటి? వాటి పరిష్కారాలు ఏంటి? ఆరోగ్యం, విద్య నుంచి సినిమా ప్రచారం వరకు ప్రతిదీ నిర్మాతలందరికీ అందుబాటులోకి తీసుకు రావడమే మా లక్ష్యం. వీటిని దృష్టిలో పెట్టుకుని ఒక ట్రస్ట్ ఏర్పరిచి దాని ద్వారా అర్హులైన సభ్యులు అందరికీ వీలైనన్ని సదుపాయాలు కల్పించాలనేది మా ప్రతిపాదన. మా లక్ష్యం.

‘ప్రోగ్రెస్సివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్’ ద్వారా తెలుగు చలన చిత్ర  నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రన్నింగ్ నిర్మాతలు ఎవ్వరికీ పదవుల మీద ఆశ లేదు. గిల్డ్, మండలి వేర్వేరుగా ఉండటం ఇష్టం లేదని చెబుతున్నారు కాబట్టి ఆ రెండిటినీ సమన్వయపరిచి ఎలా ముందుకు తీసుకు వెళ్లాలనేది మా ఆలోచన. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతల మండలికి ఏది కరెక్ట్? అని ఆలోచించి ఓటు వేయండి. మండలిలో రన్నింగ్ ప్రొడ్యూసర్స్ లేకపోతే ఎలా ఉంటుందనేది గత నాలుగైదేళ్లలో చూశారు. రన్నింగ్ ప్రొడ్యూసర్స్ ఉంటే నిర్మాతలకు అండ దొరుకుతుంది. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు. మాకు స్వప్రయోజనాలు లేవు. నిర్మాతల సమస్యల పరిష్కారమే మా ఎజెండా. ఎవరు ఏ ప్యానల్ అని కాదు, రన్నింగ్ నిర్మాతలకు ఓటు వేయడం మండలి భవిష్యత్తుకు ఎంతో అవసరం.
మీ
ప్రోగ్రెస్సివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్.

Telugu Film Producer Council Elections held on 19-02-2023 following is our Progressive Producers Panel:

President:
1. Damodar Prasad K.L

Vice-Presidents:
Ashok Kumar K (Unanimous)
Supriya Y (Unanimous)

Secretaries: cast 2 votes
No.2 Mohan Goud J.V,
No.3 Mohan Vadlapatla

Joint Secretaries: cast 2 votes
No.2 Bharath Chowdary
No. 3 Gururaj A

Executive Committee: cast 15 votes

No.1 Abhishek Agarwal
No.5 Danayya D.V.V
No.9 Krishna Thota
No.10 Madhusudhan Reddy B (Tagore Madhu),
No.13 Padmini N,
No.14 Rahul Yadav Nakka
No.15 Ramakrishna Garagaparti (Ramky)
No.17 Sravanti Ravikishore P.V
No.18 Ravindra Gopala
No.20 Ravishankar Yalamanchili (Mythri Movies)
No.21 Sairajesh Neelam,
No.25 Surender Reddy Y,
No.27 Venkatramana Reddy V, (Dil Raju)
No.28 Venu Gopal B,
No.29 Vijaykumar Reddy C.G.P,

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest