పశుగణాభివృద్ది సంస్థ రాష్ట్ర చైర్మన్ విజయ్ కుమార్ ఏకగ్రీవం

గుంటూరు
పశుగణాభివృద్ది సంస్థ(APLDA) కార్యాలయం, గుంటూరు నందు జరిగిన రాష్ట్ర చైర్మన్ ఎన్నికలలో
నెల్లూరు జిల్లా పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్  గొల్లపల్లి విజయ్ కుమార్.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్ధ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికవటం జరిగింది.నామినేషన్ ప్రక్రియ అనంతరం ఎన్నికల అధికారి  సింహాచలం  సంస్థ  సభ్యుల సమక్షంలో  గొల్లపల్లి విజయ్ కుమార్  ఎన్నికనను ప్రకటిస్తూ నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం సంస్థ సీఈఓ శ్రీనివాస రావు గారు నూతన చైర్మన్ విజయ్ కుమార్  తో ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపారు.
ప్రమాణ స్వీకార అనంతరం చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ… సంస్థ అభివృద్ధికి ప్రభుత్వానికి సంస్థకు వారధి గా వుంటానని, సహచర  సభ్యులతో ను, అధికారుల తోను సమన్వయం చేసుకొని సంస్థ పురోగతిని సాధిస్తానని, తనను ఛైర్మన్ గా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, మంత్రివర్యులు అప్పల రాజుకి, సహకరించిన శాసన సభ్యులు  ప్రసన్న కుమార్ రెడ్డికి, సహచర సభ్యులు (జిల్లా చైర్మన్)లకు, నాయకులకు, సంస్థ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి  అతిథిగా కోవూరు ఎమ్మెల్యే  నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ,జిల్లా ఛైర్మన్ లు పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest