పెనకనమెట్ట గ్రామంలో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన

  • రు. 153.8 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు
  • పాల్గొన్న మంత్రులు అంబటి రాంబాబు, తానేటి వనిత , ఎంపి, ఎమ్మెల్యే లు

కొవ్వూరు,(14.11.2023)
జగనన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ పాలన అందించడం జరిగిందని , పేదల 3పని చేసే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.

మంగళవారం కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అంబటి రాంబాబు, హోం మంత్రి తానేటి వనిత, ఎంపి భరత్ రామ్, ఎమ్మెల్యే లు జక్కంపూడి రాజా, జి. శ్రీనివాస నాయుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి గత నాలుగేళ్ల పాలనలో అమలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదల సొంత ఇంటి కల సాకారం చేసే దిశలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందని అన్నారు. గత నాలుగున్నర సంవత్సర కాలంలో జగనన్న ప్రభుత్వం బటన్ నొక్కండం ద్వారా పేదల బ్యాంకు ఖాతాలో రూ.2,35,000 లక్షల రూపాయలు జమ చేశామన్నారు.  ఇంటి వద్ద కే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా మన్నారు. జనవరి నుంచి 3 వేల రూపాయల సామాజిక భద్రత పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో 87 శాతం మంది ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వం వెనుక ప్రజలు ఉంటారనే నమ్మకంతో ధైర్యంగా ప్రజల ముందుకు వస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

హోమ్ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ6, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అమలు చేయడం ఒక్కటే మన ముందు ఉన్న లక్ష్యం అని అన్నారు. ఆ మేరకు గత నాలుగున్నర ఏళ్ల కాలంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. నేడు ఆదిశలో గ్రామ స్థాయి లో మరింత మెరుగైన పాలన అందించే ప్రయత్నం లో సచివాలయ, అర్భికే, హెల్త్ సెంటర్ భవనాలు నిర్మించడం జరిగిందన్నారు.

ఈ పర్యటన లో భాగంగాఒక కోటి ఏభై మూడు లక్షల ఎనభై వేలు రూపాయలు లతో చెప్పట్టిన, చేపడుతున్న రు.35 లక్షలతో నిర్మించిన  గ్రామ సచివాలయం భవనం, రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం , రూ .25 లక్షలతో నిర్మించిన పెనకనమెట్ట  సిసి మెయిన్ రోడ్ ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం
రు.50 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ , డ్రైయిన్ కు శంకుస్థాపన, రూ.22 లక్షలతో నిర్మిస్తున్న దొమ్మేరు ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం ఎరువుల గోడౌన్ కు శంఖుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest