ప్రేమ్ సాగర్ రావుకు వ్యతిరేకంగా నేతకానిల ఆందోళన

 

  • గొమాసే శ్రీనివాస్ కు పిఎస్ ఆర్ క్షేమాపణ చెప్పాలి
  • ప్రేమ్ సాగర్ రావుకు నేతకాని ఓట్లు అవసరం లేదా?
  • శ్రీనివాస్ పై జరిగిన దాడిని ఖండించిన నేతకాని మహార్ నేతలు

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు కు వ్యతిరేకంగా తెలంగాణ నేతకాని మహర్ నాయకులు గళం ఎత్తారు. మంచిర్యాల జిల్లా, జగిత్యాల జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేతకాని , మహార్ లు ఆందోళనకు దిగారు. టీపీసీసీ కార్యదర్శి, నేతకాని మహార్ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గోమాసె కారు పై దాడి చేసిన ప్రేమ్ సాగర్ రావు క్షేమపాన చెప్పాలని నేతకాని మహార్ నేతలు డిమాండ్ చేశారు.

మంచిర్యాల

బెల్లం పెల్లి లో జరిగిన హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి శ్రీనివాస్ గొమాసే పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు.
మంచిర్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నేతలు మాట్లాడారు.
తెలంగాణ నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యేస్కూరి రాజమల్లు మాట్లాడుతూ మంచిర్యాల లో ఎమ్మెల్యే గా పోటీ చేయాలనుకుంటున్న ప్రేమ్ సాగర్ రావుకు నేతకాని మహార్ లో ఓట్లు అవసరం లేదా?అని ప్రశ్నించారు. నేతకాని మహార్ సామాజిక వర్గం అంటే అంతా చులకనా? మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు మూడు నియోజకవర్గాల్లో నేతకాని సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉంటాయని ఈ విషయం గుర్తు పెట్టుకుని రాజకీయ నాయకులు మసులుకుంటే అందరికి మంచిదని అన్నారు. మా సామాజిక వర్గానికి చెందిన జాతీయ నాయకులు శ్రీనివాస్ గొమాసే పై దాడి చేసినందుకు ప్రేమ్ సాగర్ రావు తక్షణమే క్షేమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల పిలుపు మేరకే బెల్లం పెల్లి కి అతిథిగా వచ్చిన శ్రీనివాస్ గొమాసే పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర యువత అధ్యక్షుడు రత్నం ప్రదీప్ మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి చెందిన జాతీయ నాయకులు శ్రీనివాస్ గొమాసే పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
సల్లూరి సమీల్ కుమార్(జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ ), గొనె శ్రీకాంత్( జిల్లా యూత్ సెక్రటరీ ), ఆకుదారి కుమారస్వామి(చెన్నూర్ నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ ), బోర్లకుంట ప్రణయ్ (బెల్లంపల్లి నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్), సల్లూరి కార్తీక్(మంచిర్యాల నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ ), దుర్గం ప్రవీణ్, బెంబడి మహేష్,
తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల నేతల ఖండన

నేతకానీ సంఘ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గోమాసే శ్రీనివాస్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ నేతకాని మహార్ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టేకుమట్ల ప్రభాకర్ తో పాటు జగిత్యాల జిల్లా నేతలు చెప్పారు. జగిత్యాల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రేమ్ సాగర్ రావు అనే కాంగ్రెస్ నాయకుడు నేతకాని సమాజానికి క్షేమపాన చెప్పాలని టేకుమట్ల ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం రాజన్న , జగిత్యాల జిల్ల అధ్యక్షులు పిప్పల గంగరాజాం , రాష్ట్ర నాయకులు దుర్గం రవీందర్ నేత , జాడి ప్రేమ్ సాగర్ నేత, జగిత్యాల జిల్ల నాయకులు దుర్గం రాజేందర్ నేత , దుట నరేందర్ నేత , దుట గంగరాజాం , జిల్ల మండలాల సంఘ నాయకులు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

భూపాలపల్లి:
గోమాస శ్రీనివాస్ గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని గురువారం తెలంగాణ నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం భూపాలపల్లి జిల్లా అధికార ప్రతినిధి జాడి సరేశ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోమాస భూమయ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి మాట్లాడుతూ  అగ్రకుల అహంకారంతో సొంత పార్టీలో ఎదుకుతున్న నాయకుడి ఎదుగుదలను ఓర్వలేని కొక్కిరాల ప్రేమసాగర్ రావు ఇప్పటి పలుమార్లు దాడికి చేయడానికి ప్రయత్నించి బుధవారం భౌతిక దాడికి పాల్పడి కార్యకర్తలపై దాడి చేసి గాయపర్చడం, కారు అద్దాలు పగులగొట్టడం తన దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. తనకు పార్టీ టికెట్ రాదని, ఒకవేళ వచ్చిన గెలవలెనని తెలుసుకున్న ప్రేమసాగర్ రావ్ ఎదుగుతున్న నాయకుడిపై దాడి చేయడం తన పిరికితనమన్నారు. తెలంగాణ నేతకాని మహార్ కుల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ జాతీయ అధ్యక్షుడు, టీపీసీసీ జెనరల్ సెక్రెటరీ గోమాస శ్రీనివాస్ గారు బుధవారం బెల్లపల్లి లో హాత్ సే హాత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో పాగోన్న గోమాసే శ్రీనివాస్ గారిపై మాటువేసి తన కాన్వాయ్ పై దాడికి దిగరన్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా, కార్ ధ్వంసం అయ్యిదన్నారు. ఇప్పటికైన నువ్వు నీ ధోరణిని మార్చుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో నిన్ను ఓడించడానికి కంకణం కడుతాం కబడ్ధార్ ప్రేమసాగర్ రావ్ అని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బౌతు రాజేష్, భీం సైనిక దళ్ జిల్లా అధ్యక్షుడు దుర్గం భిక్షపతి, జిల్లా యూత్ అధ్యక్షుడు బౌతు రమేష్, భూపాలపల్లి మండల అధ్యక్షుడు దుర్గం సాగర్, గజ్జె విజేందర్, జాడి మల్లయ్య, మహాదేవపూర్ మండల గౌరవ అధ్యక్షుడు కుమ్మరి చిన్న లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest