కళాతపస్వి కె.విశ్వనాథ్ జయంతి ఫిబ్రవరి 19. ఆయన జయంతి సందర్భంగా ‘వెండి’తెర ‘బంగారు’ దర్శకుని కథగా కె.విశ్వనాథ్ గారి ‘విశ్వదర్శనం’ ఫిబ్రవరి 19వ తేది సాయంత్రం 4గంటల 30 నిమిషాలకు ఈటీవిలో ప్రసారం కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జనార్ధనమహర్షి దర్శకునిగా టి.జి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రం అనేక అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కె.విశ్వనాద్‌గారి అభిమానులు, కుటుంబసభ్యులు ఆయనపై చేసిన ఈ ‘విశ్వదర్శనం’ చూసి ఆనందించాలని చిత్రనిర్మాతలు, దర్శకుడు కోరుకుంటున్నారు.
Post Views: 137