ఫిలింనగర్ లో ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి

హైదరాబాద్, ఫిబ్రవరి 07 :

బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి(Ramabai ambedkar) 125 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఫిలిం నగర్ లోని జ్ఞ్యాని జైలు సింగ్ నగర్ లో మాల వెలుగు సంఘం ఆధ్వర్యంలో రమాబాయి జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాల వెలుగు సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో జరిగిన రమాబాయి జయంతి వేడులకు హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న , భీం మిషన్ ఆఫ్ ఇండియా (BMI) రాష్ట్ర అధ్యక్షుడు సర్వయ్య ముఖ్య అథిదులుగా హాజరైయ్యారు. బాబాసాహెబ్ విగ్రహానికి , రమాబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లర్పించారు. నివాళి అర్పించిన వారిలో సీనియర్ జర్నలిస్ట్ , బి ఎం ఐ ప్రధాన కార్యదర్శి మసాదే లక్ష్మి నారాయణ కూడా ఉన్నారు.
ఈ సందర్బంగా హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న (prasanna)మీడియాతో మాట్లాడారు. రమాబాయి లాగే ప్రతి మహిళా త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం వల్లే ఈ రోజు మహిళలకు అన్ని విధాలుగా హక్కులు లభించాయని చెప్పారు. అంబేద్కర్ అడుగుజాడల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్నారని ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉన్నత స్థాయి గౌరవం లభిస్తోందని , ఈ ఘనత కేసీఆర్ దేనని అన్నారు.

భీం మిషన్ ఆఫ్ ఇండియా(BMI) రాష్ట్ర అధ్యక్షుడు సర్వయ్య (sarvaiah)మాట్లాడుతూ రమాబాయి చేసిన త్యాగం మరెవ్వరూ చెయ్యలేరని అన్నారు. ఆమె త్యాగఫలితమే ఈ రోజు మనకు లభించిన హక్కులు అని అన్నారు. ఆ రోజు రమాబాయి తమ జీవితాన్ని త్యాగం చేసి ఉండకపోతే బాబాసాహెబ్ ఇంత పెద్ద చదువు చదివేవారు కాదని, మనకోసం ఇంత మంచి పని చేసేవారు కాదేమోనని అన్నారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్న , ఆనారోగ్యం పాలైనా తన భర్త చదువుకోవాలనే ఒకే ఒక ఆశయంతో రమాబాయి తన జీవితాన్ని త్యాగం చేసిందని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రమాబాయిని ఆదర్శనంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సర్వయ్య పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest