ఫ్యాషన్ మోడలింగ్ నుండి సినిమాల్లోకి వస్తున్న బెవిలిన్ భరాజ్

ఫ్యాషన్ మోడలింగ్ నుండి తెలుగు సినిమాల్లోకి వస్తున్న బెవిలిన్ భరాజ్ (Bevelyn Bharrajj)
ముంబై కి చెందిన ప్రముఖ ఫ్యాషన్ రంగ మోడల్.. బెవిలిన్ భరాజ్ తెలుగు సినిమా రంగంలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. తన క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్ తెలియజేయడానికి ఫిలిం ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఆమె. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు బెవిలిన్ భరాజ్ సమాధానాలు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ  “ఫ్యాషన్ మోడలింగ్ లో అక్కడ నాకు మంచి పేరు, ఒక స్టార్ డం ఉంది. మాది ముంబైలో వ్యాపార కుటుంబం.  సోలార్ ఎనర్జీ బిజినెస్ లో ఉన్నాము.
“రే ఫోర్స్ గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్”  కంపెనీ నిర్వహిస్తున్నాము. నేను ఈ సంస్థలో డైరెక్టర్ గా పని చేస్తున్నాను. మా సంస్థ సోలార్ ఎనర్జీని తయారు చేస్తుంది.
ఫ్యాషన్ మోడలింగ్ లో అడుగుపెట్టి మంచి విజయం సాధించాను. ఇంటర్నేషనల్ స్థాయి లో పాపులారిటీ సంపాదించాను. ఇప్పుడు సినిమాల్లో నటించడానికి కూడా మా పేరెంట్స్ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. నేను నటనలో, డాన్సులలో, ఫైట్స్ లో శిక్షణ పొందాను. సినిమాలు అంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. బాహుబలి, పుష్ప, ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలు  తెలుగు సినిమాని జాతీయ స్థాయికి చేర్చాయి. ఫ్యాషన్ మోడలింగ్ లో ముంబైలో బిజీగా ఉండటం వల్ల హైదరాబాద్ రాలేకపోయాను. ఇప్పుడు సమయం కుదిరింది.
తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నాను. అందుకే హైదరాబాద్ వచ్చాను. పలువురు దర్శక నిర్మాతలను కలిశాను.. కలుస్తున్నాను. హీరోయిన్., నెగిటివ్ షేడ్స్  ఉన్న హీరోయిన్., యాక్షన్ హీరోయిన్… ఇలా ఏ పాత్ర ఇచ్చినా న్యాయం చేస్తాను. త్వరలోనే మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాను” అన్నారు బెవిలిన్ భరాజ్.
బాలీవుడ్ సినిమా రంగంలో మా  బంధువులు, స్నేహితులు చాలామంది పెద్ద స్థాయిలో ఉన్నారు. అయితే వారిలో ఎవరి పేరు ఉపయోగించుకోకుండా స్వశక్తితో నా కెరీర్ ని నిర్మించుకోవాలి అనుకుంటున్నాను. అందుకే వారి పేర్లు చెప్పడం లేదు.. అన్నారు బెవిలిన్.
హాలీవుడ్ హీరోయిన్ లాగా కనిపించడం ఈ నటి ప్రత్యేకత
Bevelyn Bharrajj, a fashion model, is entering Telugu movies.
Mumbai-born fashion model who is well-known. Bevelyn Bharrajj arrived in Hyderabad to try her luck as a Telugu movie actress. To showcase her abilities, she planned a meeting of journalists at Film Chamber. On this occasion, Bevelyn Bharrajj provided various answers to inquiries from journalists. I am a successful fashion model with a solid reputation. We are a Mumbai-based business family. We are in the solar energy sector. Ray Force Green Tech Pvt Ltd is a business that we manage. In this business, I serve as a director. Solar energy is produced by our business.
I became a fashion model and had some success. On a global scale, I rose in popularity. My parents now support me in acting in movies as well. I had training in acting, dancing, and combat. I adore watching movies. I frequently watch Telugu movies. Telugu cinema reached a national level thanks to films like Baahubali, Pushpa, and RRR. I was too busy modelling for fashion in Mumbai to get to Hyderabad. The moment has arrived. I wish to act in Telugu movies. I came to Hyderabad for that reason. I’ve spoken to a lot of producers and directors. Action heroine, heroine with a dark side, heroine… Any role you assign me, I’ll play it with honour. Bevelyn Bharrajj declared, “I shall soon appear before the Telugu public with a good film.
Many of our family members and acquaintances are well-known in Bollywood movies. Numerous members of our family and acquaintances are well-known in the Bollywood film industry. However, I want to develop my career on my own without mentioning any of them by name. Because of this, Bevilin stated, “their names are not being mentioned.”
Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest