బండి సంజయ్‌ V/S అరవింద్- కమలంలో కోల్డ్ వార్

హైదరాబాద్:

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోన్న కమలనాథుల్లో కల్లోలం మొదలైంది. నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఏకంగా తెలంగాణ పార్టీ బాస్ బండి సంజయ్‌పై సొంత పార్టీ నేతలే విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ కవిత పట్ల బండి చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతున్నారు. పార్టీ అద్యక్షుడు బండి సంజయ్ తనవ్యాఖ్యలను ఉపసంహారించుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరుతున్నారు….అసలు అరవింద్ స్వంత పార్టీ అద్యక్షుడి పైన అంత ఘాటుగా ఎందుకు ఫైర్ అయ్యారు.. సన్నిహితులుగా ఉండే ఇద్దరు బీజేపీ ఎంపీల మధ్య రాజకీయ విభేదాలు ఎందుకు వచ్చాయి… అరవింద్ బండి సంజయ్ ల మధ్య కోల్డ్ వార్ కు కారణాలు ఏంటి… వాచ్ దిస్ స్టోరీ.

క్రమశిక్షణకు మారుపేరుగా చేప్పుకునే?
బీజేపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు భాజపా రాష్ర్ట కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కవితను అరెస్టు చేయకపోతే ముద్ధు పెట్టుకుంటారా అంటూ బండి సంజయ్‌ వ్యాఖ్యానించడాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడిపై అసంతృప్తిని వెళ్లగక్కారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటే కోఆర్డినేట్‌ చేయడానికేనని.. పవర్ సెంటర్ కాదన్నారు. అంతేకాదు తన రాజకీయ ప్రత్యర్థి ఎమ్మెల్సీ కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలు సమర్ధనీయం కాదని.. క్షేమాపణ చెప్పాలని కోరారు. అరవింద్ ఇంత ఘాటుగా అసంతృప్తి వెళ్లగక్కడం వెనక ఎదో పెద్ద కారణమే ఉంటుందని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి.

బండి సంజయ్, ఎంపీ అరవింద్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు. మొన్నటి వరకు వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అరవింద్ – సంజయ్ మధ్య పార్టీ వ్యవహారాల్లో ఎక్కడో తేడా కొట్టిందనే ప్రచారం జరుగుతుంది.నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ వ్యవహరాల పై ఎంపీ అరవింద్ పూర్తి అధిపత్యాం చెల్లాయిస్తున్నారు.అయితే గత కొంత కాలం నుంచి పార్టీ అద్యక్షుడు బండి సంజయ్ జిల్లా బీజేపీలో ఎంపీ అరవింద్ వర్గానికి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎడు అసెంబ్లీ నియోజకవర్గల్లో కూడా బండి సంజయ్ అరవింద్ తెలియకుండానే పార్టీ కార్యక్రమలను నిర్వహించేందుకు స్థానిక బీజేపీ నాయకులను ఎంకరేజ్ చేస్తున్నాడని ఎంపీ వర్గీయులు అంటున్నారు.నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బస్వా నర్సయ్య ,జిల్లాఇన్ చార్జీ మీసాల చంద్రయ్య వీరిద్దరూ ఎంపీ అరవింద్ కు మొదట సన్నిహితులుగా ఉండేవారు. ప్రస్తుతం వీరిద్దరూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి చాల దగ్గరైన్నారాని జిల్లా చర్చ జరుగుతోంది. స్థానిక ఎంపీ కంటే రాష్ట్ర అధ్యక్షుడికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అరవింద్ తన జిల్లాలో బండి సంజయ్ రాజకీయ జోక్యం చేసుకొని తన ప్రత్యర్థి వర్గాల నాయకులను ప్రోత్సాహిస్తున్నారని ఆగ్రహంతో ఉన్నాట్టు పార్టీ శ్రేణులో చర్చ సాగుతోంది.

నిజామాబాద్ జిల్లాలో చేరికల అంశంలో ఎంపీ అరవింద్ బండి సంజయ్ ఇద్ధరి మధ్య విభేదాలు వచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరేందుకు అరవింద్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం ఉంది. బాల్కొండకు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ అదినేత పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న అరవింద్ అడ్డుపడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. బీజేపీ చేరాలనుకునే ఇతర పార్టీలకు చెందిన నేతలు బండి సంజయ్ తో టచ్ లో ఉండటం అరవింద్ కి మింగుడు పడటంలేదని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది.పలు అంశాలపై పార్టీ అద్యక్షుడు బండి సంజయ్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ మధ్య విభేదాలతో కోల్డ్ వార్ నడుస్తోంది.

బీజేపీలోఇప్పటికే బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మధ్య విభేదాలు అధిష్టానం దృష్టికి వెళ్లాయి.ఈమధ్య కాలంలోనే రాష్ర్టానికి చెందిన ముఖ్య నేతలను డిల్లీకి పిలిపించి జాతీయ నేతలు క్లాస్ తీసుకున్నారు.బండి సంజయ్‌ – అర్వింద్‌ పంచాయతీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై జాతీయ నాయకత్వం ఎలా వ్యవహారిస్తోందో చూడాలి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest