బడ్జెట్ అంతా గంభీరాలు డాంబికాలే

హైదరాబాద్
కులాలకు అతీతంగా లింగమంతుల స్వామిని ప్రజలు కొలుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.
బీజేపీ తరపున మొక్కులు చెల్లించుకున్న సందర్బంగా ఈటెల మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే పెద్దగట్టుకి స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించి అధిక నిధులు కేటాయిస్తాం. తమ మొక్కులు ఫలించి బీజేపీ అధికారంలోకి వస్తే పెద్దగట్టు సంపూర్ణ అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈటెల బడ్జెట్ పై కూడా స్పందించారు.
2.95 లక్షల బడ్జెట్ ప్రకటించినా ప్రజల్లో సంతృప్తి లేదు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగులు రిటైర్ అయితే జీపీఎఫ్ ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్ సర్కారుంది. సర్కారుని నమ్మి బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జీతాలు సమయానికి రాక బ్యాంకు emi లు కట్టలేక ఉద్యోగుల పై ఎగవేతదారులుగా ముద్రపడుతుంది.రైతులకు రుణాల మాఫీ లేదు. గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని అంకెల గారడీ చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారు.
బడ్జెట్ అంతా గంభీరాలు డాంబికాలే. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ప్రజల చేతుల్లో చిత్తుగా ఒడిపోతుంది. పరిపాలించే సత్తాలేని వారే ముందస్తుగా రాజీనామా చేస్తారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధం. ప్రజలను బాధలు పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి దగ్గర ప్రజలకు దూరం. తెలంగాణాలో రాచరిక పరిపాలన సాగిస్తున్న కేసీఆర్. ఇక్కడ పరిపాలించే సత్తా లేని కేసీఆర్ దేశ పర్యటనలు చేసి ఎం సందేశం ఇస్తారు? అని ఈటల ప్రశ్నించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest