బాధిత కుటుంబాలకు అండగా సీఎంఆర్ఎఫ్

 

  • 3 లక్షల రూపాయల చెక్కును అందించిన మంత్రి గంగుల కమలాకర్

హైదరాబాద్

ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపన్నులకు అండగా నిలుస్తున్నదన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్.  బాధిత కుటుంబానికి మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన 3 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుని అందజేసారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు ఓ కుటుంబానికి ఆసరాగా నిలిచినందుకు ఆనందంగా ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్. వివరాల్లోకి వెల్తే హైదరాబాద్కి చెందిన 43 సంవత్సరాల నర్సింగరావ్గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాదపడుతున్నాడు. 2022 డిసెంబర్ 10వ తారీఖున వచ్చిన గుండెపోటుతో ఆసుపత్రిలో మరణించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా హాస్పిటల్ బిల్లులు సైతం చెల్లించలేని పరిస్థితుల్లో మంత్రి గంగుల కమలాకర్ని సంప్రదించగా వారి దీన పరిస్థితికి చలించిన మంత్రి ముఖ్యమంత్రి సహాయనిది నుండి 3 లక్షల రూపాయల్ని మంజూరు చేయించారు. నేడు ఆ చెక్కుని బాధిత కుటుంబానికి చెందిన నర్సింగరావు భార్య బి. లక్ష్మీకి అందజేసారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest