బాబు అరెస్ట్ -ఎల్లమ్మ తల్లికి బోనాలు

హైదరాబాద్ , సెప్టెంబర్ 15 : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలంగాణలో ఉన్న సెటిలర్ల ఫోరమ్ స్పందించింది. తెలుగుదేశం స్పాన్సర్ చేసిన ఐ టి ఉద్యోగులు కొందరు రెండు రోజులుగా హైటెక్ సిటీ వద్ద ఆందోళన చెయ్యడానికి ప్రయత్నించగా పోలీసులు చెదరగొట్టారు. అయితే మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బల్కం పేటలోని ఎల్లమ్మతల్లికి తెలుగుదేశం మహిళలు బోనాలు సమర్పించారు. ఎల్లమ్మ తల్లి కరునించైనా బాబుకు బెయిల్ రావాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుమహిళా రాష్ట్ర అధ్యక్షురాలు షకీలా రెడ్డి తదితరులు ఉన్నారు.

వరంగల్ దర్గాలో పూజలు
జెమినీ టాకీస్ దగ్గర మస్తాన్ సాబ్ దర్గా లో తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంట్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పేరు మీద త్వరగా బేలు రావాలని ఆయురారోగ్యాలతో ఉండాలని తిరిగి ప్రజాక్షేత్రంలో ఉండాలని రాబోయే రోజులలో ముఖ్యమంత్రిగా చూడాలని మస్తాన్ సాబ్ దర్గాలో చాదరు కప్పి పూలు సమర్పించి దువా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీర రాజు నాయక్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి హనంకొండ సాంబయ్య రాష్ట్ర కార్యదర్శి బాబా ఖాదర్ అలీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బైరపాక ప్రభాకర్ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి నాగవల్లి సురేష్ వరంగల్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు జిఎల్ శ్రీధర్ వరంగల్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నల్లకుంట రవికుమార్ పార్లమెంట్ నాయకులు బరిగల సుధాకర్ దేవేందర్ రాజు వెలగందల రవీందర్ గుప్తా మామిండ్ల రాములు సుదర్శన్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest