BigBoss-7లో రతిక అవుట్ -మహిళలకు అన్యాయం

హైదరాబాద్, 01 అక్టోబర్ 2023:
బిగ్ బాస్ -7 తెలుగు రియాలిటీ షో నుంచి నాలోగో ఎలిమినేషన్ జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన నాలుగో ఎలిమినేషన్ లో రతిక బయటికి వెళ్లిపోయారు. ఉల్టా ఫుల్టా పేరుతో జరుగుతున్న ఈ సీజన్ లోనూ నాగరాజును హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే వాళ్ళను పంపిస్తున్నారు. తెలుగు బాషా మాట్లాడలేని వాళ్ళని మాత్రం బిగ్ బాస్ లో కొనసాగిస్తున్నారని ఈ షోను చూసిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఒకపక్క కేంద్రం అన్ని రంగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చెయ్యడానికి సిద్ధమవుతుంటే బిగ్ బాస్ మాత్రం కేంద్రం ఆశయాలకు గండి కొడుతున్నట్టు కనిపిస్తోంది. నాలుగు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో లో ఇప్పటి వరకు నలుగురు మహిళలను ఎలిమినేషన్ చేశారు.ఫస్ట్ ఎలిమినేషన్ లో హీరోయిన్ కిరణ్ రాథోడ్, రెండో ఎలిమినేషన్ లో హీరోయిన్ షకీలా, మూడో ఎలిమినేషన్ లో గాయని దామిని, నాలుగో ఎలిమినేషన్ లో రతికను బయటికి పంపించాడు బిగ్ బాస్. బిగ్ బాస్ మహిళా పోటీదారులు అన్యాయం చేస్తున్నాడని చెప్పవచ్చు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest