బీసీలకు ఒక న్యాయం – ఎస్సిలకు ఇంకో న్యాయం ? కేసీఆర్ జీ ఇదేం అన్యాయం ?

హైదరాబాద్ :

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామా రావు సుపుత్రుడు , మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ (పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టి నప్పుడు తెలంగాణ రాష్ట్రము ఏర్పడటాన్ని వ్యతిరేకించిన వ్యక్తి) రోడ్డు నిబంధనలకు వ్యతిరేకంగా స్పీడుగా వెళ్ళి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నాదనమూరి హరికృష్ణ ( కమ్మ సామాజిక వర్గం) కు ప్రభుత్వం అధికార లాంఛనాలతో సాగనంపింది.
  • ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సినిమా నటుడు సూపర్ స్టార్ కృష్ణ (కమ్మ సామజిక వర్గం) ఇంట్లో చనిపోతే అతనికి తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఇతను కాంగ్రెస్ హయాములో మాజీ ఎంపీగా చేశాడు.
  • ఆంధ్రప్రదేశ్ కు చెందిన కృష్ణం రాజు (రాజుల సామజిక వర్గం) చనిపోతే తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఖననం చేసింది.
  • టి ఆర్ ఎస్ పార్టీ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య (యాదవ్ సామజిక వర్గం) సిట్టింగ్ ఎమ్మెల్యేగా చనిపోతే ఆయనకు కూడా తెలంగాణ సర్కారు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నోముల అంత్యక్రియలకు వెళ్లారు.

కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే జి. సాయన్న చనిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన నివాసానికి వెళ్లి ఓ అయిదు నిముషాల్లో ఆయనకు నివాళ్ళర్పించి వెనుతిరిగి వెళ్లిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు మాతం సాధారణంగా జరిగిపోయాయి. అధికార లాంచనాలతో తెలంగాణ ప్రభుత్వం సాయన్న అంత్యక్రియలు నిర్వహించలేదు.

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య (సిట్టింగ్ ఎమ్మెల్యేగా చనిపోయారు) , కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (సిట్టింగ్ ఎమ్మెల్యేగా చనిపోయారు) బీసీ సామజిక వర్గానికి చెందిన నోములకేమో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. అదే పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న దళితుడు కాబట్టి ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదనుకోవాలా? సీఎంఓ నుంచి జీఏడీ కి సమాచారం రాలేదు కాబట్టే అధికారులు సాయన్న అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించలేదని ప్రచారం తెరమీదకు వచ్చింది. అంటే సొంత పార్టీ ఎమ్మెల్యే చనిపోయినా కూడా పట్టించుకోలేనంతగా సీఎంఓ ఉందా? లేక సీఎంఓలో కూడా పని చేసేవాళ్ళెవరూ దళితులు కాదు కాబట్టి ఈ విషయాన్నీ పట్టించుకోలేదా? నిజమే సీఎంఓ లో ఆంద్రోళ్ళు, అగ్రకులాల వాళ్ళు, బీసీలు పని చేస్తున్నారు. అందుకేనా సాయన్నను సీఎంఓ మర్చిపోయింది.
టి ఆర్ ఎస్ నుంచి బి ఆర్ ఎస్ గా మారిన కేసీఆర్ పార్టీలో అసలు అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మొగోడెవడైన ఉన్నాడా? జీవితంలో మంత్రికాలేనని మూలాన కూర్చున్న ఎర్రబెల్లి దయాకర్ వెలమ సామజిక వర్గం కావడం వల్లే కదా కేసీఆర్ కేబినెట్ లో బెర్త్ దొరికింది. ఒక కేవలం కేసీఆర్ వెలమ సామజిక వర్గం కాకుండా ఉంటె ఎర్రబెల్లి మంత్రి అయ్యేవాడా? అంటే కేసీఆర్ రాజ్యంలో కేవలం అగ్రకులాలకు మాత్రమే అధికార లాంఛనాలు జరుగుతాయని ప్రజలు భావించాల్సిందేనా? ప్రగతి భవన్ లో జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఓ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అవమాన పేర్చిన ఘటన మరవకముందే సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం అంటే ఇది రాజకీయ అంటరానితనాన్ని రుజువు చేయడమే. రాజకీయ వర్గాల్లో ఇంకా దళితుల పట్ల వివక్ష, అంటరానితనం బతికే ఉందని తెలంగాణ ప్రభుత్వం రుజువు చేసింది.

తెలంగాణ కు ఏ సంబంధం లేకున్నా, తెలంగాణ ప్రజల కోసం కనీసం ఒక్క మంచి పని చేయకపోయినా ఆంధ్రోళ్ళయిన సినిమా యాక్టర్లు కృషం రాజు, కృష్ణ కు మాత్రం అధికార లాంచలనతో అంత్యక్రియలు నిర్వహించి తెలంగాణ పోలీస్ బుల్లెట్లను వృధా చేసిన ఈ సర్కారు తెలంగాణ దళితుల పట్ల పొలిసు బుల్లెట్లకు ప్రేమ లేదని రుజువు చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న విషయంలో ప్రభుత్వం తప్పు చేసినప్పటికీ ఇక్కడ కేసీఆర్ కూడా మానవత్వాన్ని మారచిపోయారని చెప్పక తప్పదు.

కేసీఆర్ కు సాయన్న మధ్య మంచి సంబంధం ఉంది. కేసీఆర్ పార్టీలో సాయన్న కూడా తెలుగుదేశం నుంచి వచ్చాడు. వీరిద్దరికి తెలుగుదేశం పార్టీ నుంచే సంబంధాలు ఉన్నాయి. అయిదు సార్లు ఎమ్మెల్యేగా చేసిన సాయన్నకు మంత్రి పదవి లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి లాంటిది ఇవ్వకపోయినా కనీసం మానవతా ధోరణిలో కూడా ఆలోచించలేదు.

దద్దమ్మలు -దళిత ఎమ్మెల్యేలు
టి ఆర్ ఎస్ నుంచి బి ఆర్ ఎస్ గా మారిన పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న చనిపోతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయండి అని ఒక్క దళిత ఎమ్మెల్యే నోరూ విప్పి ముఖ్యమంత్రిని అడగలేకపోయారంటే ఆ దళిత ఎమ్మెల్యేలు ఏవిధంగా బానిసలుగా మారిపోయారా అర్ధమవుతోంది. కేసీఆర్ తరచుగా అంటుంటారు కదా విపక్షాలను తిట్టినప్పుడు దద్దమ్మలు, సన్యాసులు అని… ఇక్కడ దళిత ఎమ్మెల్యేలకు ఈ పదాలు కరెక్టుగా వర్తిస్తాయి. నిజంగానే తెలంగాణ లో ఉన్న దళిత ఎమ్మెల్యేలు దద్దమ్మలు. కేసీఆర్ స్వయంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలని అన్నప్పుడే ఏమి మాట్లాడలేని దళిత ఎమ్మెల్యేలు ఒక సాటి దళిత ఎమ్మెల్యేలకు అవమానం జరిగితే మాత్రం స్పందిస్తారని భావించడం మూర్ఖత్వమే అవుతుంది. ఈ రోజు సాయన్నకు జరిగింది రేపు ఇంకో ఎల్లన్నకో, పుల్లన్నకో జరుగుతుంది. చివరికి ఇప్పుడు బతికి ఉన్న ఏ దళిత ఎమ్మెల్యే సిట్టింగ్ లో ఉండగానే కన్నుమూసేసిన ఆయనకు ఇదే అవమానం జరుగక మానదు .

దళితులారా జాగ్రత్త !
ఈ రోజు దళితులు బాగుపడిపోయాం అనుకుంటున్నారు.ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయిపోయామనుకుంటున్నారు. ఐ ఏ ఎస్, ఐ పీ ఎస్ లు ఆయ్యమనుకుంటున్నారు. ఇతరకులాలకు ధీటుగా డబ్బులు కూడా సంపాదించామనుకుంటున్నారు. కానీ ఇంకా మిమ్ముల్ని అంటరానితం వెంటాడుతూనే ఉండనే విషయం మాత్రం మరచిపోకండి. మీరు ఎంత ఎత్తుకు ఎదిగిన, ఎంత డబ్బు సంపాదించిన, ఒక రాష్టానికి డీజీపీ అయినా మిమ్ములను దళిత డీజీపీ అంటారే తప్ప డీజీపీ అని అనరు . కాబట్టి దళిత పెద్దల్లారా తస్మాత్ జాగర్త !మిమ్ముల్ని అంటరానితనం వెంటాడుతూనే ఉంది.  రాజకీయాల్లోనూ అన్నిటికంటే చాలా ఎక్కువగా ఉంది. దళిత ఎమ్మెల్యేల్లారా జాగ్రత్త !

 

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest