బెంగళూరులో ఏరో ఇండియా-2023 వైమానిక ప్రదర్శన

బెంగళూరు

బెంగళూరులో ఏరో ఇండియా-2023 వైమానిక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. పోరాట విమానాలు, హెలికాప్టర్లు నిర్వహించిన విన్యాసాలు వీక్షకులను కట్టిపడేశాయి. కాగా, ఈ ఎయిర్ షోలో అమెరికా వాయుసేనకు చెందిన సరికొత్త ఎఫ్-35ఏ యుద్ధ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఐదో తరానికి చెందిన ఈ రెండు అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఒకటి ఎఫ్-35ఏ లైట్నింగ్-II కాగా, మరొకటి ఎఫ్-35ఏ జాయింట్ స్ట్రైక్ ఫైటర్. ఈ అత్యాధునిక జెట్ ఫైటర్లలో స్టెల్త్ పరిజ్ఞానంతో పాటు సూపర్ సోనిక్ వేగం కూడా ఉంది. ఇవాళ బెంగళూరు ఎయిర్ షోలో రెండు అమెరికా యుద్ధ విమానాల వాయు విహారం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఎఫ్-35ఏ జాయింట్ స్ట్రైక్ ఫైటర్ ఉటాలోని హిల్ ఎయిర్ ఫోర్స్ స్థావరం నుంచి ఇక్కడికి రాగా, ఎఫ్-35ఏ లైట్నింగ్-II అలాస్కాలోని ఈల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు చెందిన 354వ ఫైటర్ వింగ్ నుంచి వచ్చింది.

గత కొన్ని సంవత్సరాలుగా భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి. అమెరికా నూతనంగా అభివృద్ధి చేసిన ఈ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ యుద్ధ విమానాలను ప్రదర్శించేందుకు భారత్ ను వేదికగా ఎంచుకోవడం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలకు నిదర్శనం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest