అదిలాబాద్
అదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లో నిన్న కురిసిన వడగండ్ల వాన కి మండలం లోని పలు గ్రామాల్లో కొన్ని వేల ఎకరాలలో అపార పంట నష్టం జరిగింది.అందులో భాగంగా బోథ్ నియోజకవర్గ బాద్యులు వెన్నెల అశోక్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామ అన్వేష్ రెడ్డి పోచెర, కనుగుట్ట గ్రామాలలో పర్యటించి అక్కడ ఉన్న మొక్క జొన్న రైతుల తో కలిసి పంట పొలాలను సందర్శించి వారి పంట వివరాలను,వారికి జరిగిన నష్టాన్ని తెలుసుకొని..వెంటనే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడమే కాకుండా.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వికారాబాద్ జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని చూడనికి కుతా వేటు దూరం లో ఉన్న మర్పిళ్ల మండల కేంద్రానికి గాలి మోటార్ లో వెళ్లి జరిగిన నష్టాని కి ఎంత ఇస్తాం ఎప్పుడు ఇస్తాం అని ఎందుకు చెప్పలేదు అని అన్నారు. గత ఎనిమిదేళ్లుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే నయాపైసా కూడా రైతులకు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకాన్ని గలికొదిలేసారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొక్కజొన్న, పండ్ల తోటలు 90 శాతం, కూరగాయ తోటలు పూర్తిగా నష్టపోయినయి అని అన్నారు. పంటలు నష్టపోతే రైతులను ఆదుకునే వ్యవస్థ ను రాష్ట్ర ప్రభుత్వం నిరుగార్చిందన్నారు. గతంలో జరిగిన పంట నష్టాలతో పాటు ఇప్పుడు జరిగిన పంటలకు కూడా వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.. లేకుంటే రైతులతో కలిసి పోరాటాలకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.ఈ పర్యటనలో జిల్లా కిసాన్ కాంగ్రేస్ అధ్యక్షుడు మల్లేష్, మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి తో పాట మల్లెపూల సత్యనారాయణ, నల్ల శ్రీకాంత్ రెడ్డి తో పాటు రైతులు పాల్గొన్నారు.