మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య

మంచిర్యాల

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ  భార్య  జ్యోతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య.జ్యోతి అత్తగారింటి వేధింపులను తట్టుకోలేకనే ఆత్మహత్య కు పాల్పడింది.అదనపు కట్నం ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలని గత కొంతకాలంగా వేధింపులకు పాల్పడ్డ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ కుటుంబీకులు.పెళ్లి సమయంలో మూడు ఎకరాల భూమి ఇచ్చామని కమీషనర్ గా సెలెక్ట్ అవ్వడంతో మరో ఐదు కోట్ల రూపాయలను కట్నం కింద ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ తల్లి, తమ్ముడు వేదింపులకు పాల్పడ్డారని మృతురాలి బంధువులు ఆరోపణ.మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ గతంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించాడు. అప్పటికే మూడెకరాల భూమితో పాటు 20 లక్షల రూపాయలు ఇచ్చినట్టు ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. మున్సిపల్ కమిషనర్ గా సెలెక్ట్ అయిన అనంతరం మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని లేకుంటే విడాకులు ఇవ్వాలని జ్యోతి పై రోజు ఒత్తిడి తీసుకువచ్చేవాడని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. ఆరు నెలల నుండి శారీరకంగా మానసికంగా చిత్రహింస పెడుతున్నట్టు తల్లిదండ్రులతో జ్యోతి వెల్లడిమరో పెళ్లి కోసం మంచిర్యాల కమిషనర్ బాలకృష్ణ ప్రయత్నిస్తున్నట్టు జోరుగా వదంతులు?

అధికారులు కుమ్మక్కై కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ ను వెంటనే శిక్షించాలిఅని మీడియాతో వెల్లడించిన జ్యోతి కుటుంబ సభ్యులు

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest