* ఈ రోజు రాత్రి 8. 30 గంటలకు మంచు మనోజ్ -భూమా మౌనిక పెళ్లి
* మంచు లక్ష్మి ఇంట్లో మనోజ్ వివాహం
* కొద్దీ మంది సన్నిహితులకే ఆహ్వానం సందీప్ వంగ తో అల్లు అర్జున్ సినిమా
* కాబోయే భార్య ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసిన మనోజ్
* మంచు మనోజ్ -భూమా మౌనిక ఇద్దరికీ ఇది రెండో పెళ్లి
8 గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న మనోజ్ -మౌనిక
మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ వివాహం ఈ రోజు (మార్చి 3) సాయంత్రం జరుగనుంది. సినీ నటుడైన మంచు మనో పొలిటికల్ ఫ్యామిలీ భూమా నాగిరెడ్డి కుమర్తె భూమా మౌనికను పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా మనోజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కాబోయే భార్య భూమా మౌనిక పెళ్లి కుర్ధురుగా ముస్తాబైన ఫోటోను మనోజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మంచు మనోజ్, భూమా మౌనిక గత కొద్దీ రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇది వీరిద్దరికి కూడా రెండో వివాహమే. సోదరి మంచు లక్ష్మి నివాసంలో మనోజ్ -మౌనిక ల వివాహం జరుగనుంది. ఈ రోజు రాత్రి 8. 30 గంటలకు వీరిద్దరి పెళ్లి జరుగనుంది.
మోహన్ బాబు వస్తారా ?
భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక ను మంచి మనోజ్ పెళ్లి చేసుకోవడం తండ్రి మోహన్ బాబుకు ఇష్టం లేదని ఫిలిం నగర్ టాక్. భూమా ఫామిలీ మొత్తం తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడమే దీనికి కారణమని చర్చ జరుగుతోంది. అయితే శుక్రవారం , మార్చి 3న జరుగనున్న మనోజ్, మౌనికల పెళ్ళికి మోహన్ బాబు వస్తారా ? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూమా నాగిరెడ్డి దంపతులు ఇద్దరు కూడా చనిపోయారు. భూమా అఖిల ప్రియా తెలుగుదేశం హయాంలో మంత్రిగా పని చేసింది.