మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్

హైదరాబాద్ , మార్చి 19 :
అకాల వర్షం వల్ల పంట దెబ్బతిన్న జిల్లాలను పరిశీలించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. బంజారాహిల్స్ లోని మంత్రి నివాసంలో ఆయన్ని కలిశారు.
జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఎంపీ విహెచ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి,మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్,మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. గత మూడురోజుల నుండి కురుస్తున్న భారీ వడగళ్ల వాన కు నష్టపోయిన రైతులను అదుకోవాలని,పంట నష్టపరిహారం ఇవ్వాలని మంత్రికి కోరారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అనే ప్రాంతాల్లో అనుకోకుండా అకాల వడగళ్ల వాన కురిసిన కూరగాయల పంట, వరి ఇతర పంటలు నష్టపోయాయి.నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని మంత్రి గారిని కోరడం జరిగింది.కూరగాయల పంటకు 35వేలు, వరి పంటకు 12వేలు అలాగే నష్టపోయిన ఇతర పంటలకు ఇవ్వాలని కోరాం.రాష్ట్రంలో ఎక్కడ పంట నష్టపోయిందో విసిట్ చేయాలనీ చెప్పాం.అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడ పంట నష్టపోయిన ప్రాంతాలు విసిట్ చేస్తాం.వెంటనే రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.అలాగే ప్లాట్ ఉన్నవారికి ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పింది..
ఈ అకాల వర్షాలకు రాష్ట్రంలో అనేక చోట్ల ఇండ్లు కూలిపోయాయిన వారికి కూడ ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలని కోరాం.మంత్రి చెయ్యి ఫ్యాక్చర్ అయిన నేపథ్యంలో యోగక్షేమలు కూడ అడిగి తెలుసుకోవడం జరిగిందని జగ్గారెడ్డి చెప్పారు .

డిమాండ్స్

*వరికి ఎకరానికి 12వేలు ఇవ్వాలి.

*కూరగాయలకు, ఆకు కూరలకు ఎకరానికి 35వేలు ఇవ్వాలి.

*మక్కజొన్న ఎకరానికి 15వేలు ఇవ్వాలి.

* మామిడి తోట ఎకరానికి 50 వేలు ఇవ్వాలి.

* కోళ్ల ఫారాలు, డైరీ ఫారాలకు వడ్డీ మాఫీ చేయాలి, ధాన సబ్సిడీ ఇవ్వాలి.

*శేడ్ల పున్నరినిర్మాణానికి ఆర్ధిక సహాయం చేయాలి.

*పూర్తిగా నష్టపోయిన రేకుల తో కట్టిన ఇండ్లకు 5 లక్షలు ఇవ్వాలి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest