మందుల ధరలు పెంపు పై హరీశ్ రావు ఫైర్

హైదరాబాద్

మందుల ధరలు పెంచడం పై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు సీరియస్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. బిజెపి పాలనలో అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సఛ్చే దిన్ అని వాఖ్యానించారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12% పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణం. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య.జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే, అది పేద, మధ్య తరగతి ప్రజలకి భారం అవుతుంది.సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బిజెపి ప్రభుత్వం పనిగా పెట్టుకున్నది.అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్దమైంది. ఇది అత్యంత బాధాకరం. దుర్మార్గమైన చర్య.ఇదేనా బిజెపి చెబుతున్న అమృత్ కాల్..??ఇవి అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్..దేశంలో బిజెపి పాలనకు రోజులు దగ్గర పడ్డాయి.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest