మహిళల కోసం పోరాటం -మద్దత్తు కై కృష్ణయ్యకు వినతిపత్రం

హైదరాబాద్ :
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు ఆర్ క్రిష్నయ్య కు పలువురు మహిళలు వినతి పత్రం సమర్పించారు. తాము చేస్తున్న పోరాటానికి మద్దత్తు ఇవ్వాలని కోరారు. మురికివాడల్లో నివసించే పేద బడుగు బలహీన వర్గాల మహిళలు ఆర్థిక స్తోమత లేక* రుతుక్రమ సమయంలో అపరిశుభ్రమైన క్లాత్ లను వాడి వాళ్ళ ఆరోగ్యాన్ని పాలవుతున్నారు .డబ్బులున్న మహిళలు రుతుక్రమ సమయంలో సానిటరీ పాడ్స్ కెమికల్స్ తో తయారు చేసేవి వాడటం వల్ల చాలా అనారోగ సమస్యలతో క్యాన్సర్ బారిన పడి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.కేంద్ర, రాష్ట్రాలు మహిళల ప్రాణాలతో ఆడుకోకుండా కెమికల్ రహిత స్నాప్కిన్ తయారు చేసి ఉచితంగా అందించాలని విన్నపం ఒక పోరాటం లా ముందుకు తీసుకువెళ్తామని కృష్ణయ్యకు విన్నవించారు. మహిళా నాయకురాలు చీకూరి లీలావతి, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడేపల్లి కృష్ణమాచారి, శ్రీమతి కల్పనా ఉన్నారు. కేంద్ర, రాష్ట్రాలు మహిళల ప్రాణాలతో ఆడుకోకుండా కెమికల్ రహిత స్నాప్కిన్ తయారు చేసి ఉచితంగా అందించాలనిపోరాటం చెయ్యాల్సిన అవసరం ఉందని వారన్నారు. ఈ పోరాటానికి ఖచ్చితంగా మద్దత్తు ఇస్తానని కృష్ణయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జయంతి, దీప, పూజ, విజయలక్ష్మి, లత తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest