మార్క్ ఫెడ్ ను బలోపేతం చేయాలి

హైదరాబాద్

డిమాండ్‌ను బట్టి పత్తి, కందులు, మొక్కజొన్న, మిరపకాయలు మరియు పసుపు పంటల సేకరణకు గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కందులను పప్పుగా మార్చి మార్కెటింగ్ చేసే అవకాశాలు పరిశీలించాలి. ఆదిలాబాద్‌లోని మార్క్ ఫెడ్‌ సొంత ప్రెస్సింగ్‌ యూనిట్‌లో పత్తి సేకరణ, పత్తి బేళ్ల మార్పిడికి అవకాశాలపై అధ్యయనం చేయాలి. వేరుశెనగ ప్రాసెసింగ్ ప్లాంట్లు మరియు వేరుశెనగ ఉత్పత్తులను సిద్ధం చేయడానికి, అధ్యయనం కోసం గుజరాత్ రాష్ట్రాన్ని సందర్శించాలి. ఖచ్చితమైన హామీ ప్రాతిపదికన వాణిజ్య సేకరణ ద్వారా అవసరమైన మొక్కజొన్న సరఫరా కోసం ఇతర రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకునే అంశాలను పరిశీలించాలి

జీవ సేంద్రీయ ఎరువులు మరియు ద్రవ రూప ఎరువుల సరఫరా అవకాశాలపై చర్చ

మార్క్ ఫెడ్ యొక్క ‘‘నూతన వ్యాపార ప్రతిపాదనలపై’’ హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్ రావు గారు, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి , పాలకవర్గ సభ్యులు రంగారావు , విజయ్ కుమార్ , మేనేజింగ్ డైరెక్టర్ ఎం.యాది రెడ్డి , జనరల్ మేనేజర్ బి.విష్ణువర్ధన్ రావు  తదితరులు పాల్గొన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest