మా నమ్మకం నువ్వే జగన్

 

గృహసారధుల సేవలు ఎంతో కీలకం -కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

మా నమ్మకం నువ్వే జగన్ స్ట్రిక్టర్ ను ఆవిష్కరించారు

పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు, C.H మద్దయ్య , నగర కార్పొరేటర్లు ముఖ్య నాయకులు, గృహసారథులు, సచివాలయం కన్వీనర్లు

ముందుగా వై.యస్.ఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. నూతనంగా నియమితులైన గృహసారధులు సచివాలయ కన్వీనర్లు ప్రతి కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ గత ప్రభుత్వానికి,మన జగనన్న ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు తెలియజేయాలని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  తెలియజేసారు.  గురువారం సాయంత్రం రాయల్ ఫంక్షన్ హల్ లో కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు గృహసారధులు, కన్వీనర్లకు శిక్షణ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చెయ్యాలని సూచించారు,ముఖ్యంగా కేటాయించిన గృహాలపై అహగాహణ కలిగి ఉండటంతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు,అభివృద్ధి ప్రజలలోకి పూర్తీ స్థాయిలో తీసుకువెళ్లేలా ఉండాలని అన్నారు.వాలంటీర్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రతినిధులుగా పరిచయం చేసుకోవాలని అన్నారు. నమ్మకం నువ్వే జగన్ అని ముద్రించిన కరపత్రాలతో గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏమిచేశాడో,మన జగనన్న ఏమి చేసారో ప్రజలకు వివరించాలని అన్నారు.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  కుల మత,ప్రాంత,పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు,గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పొందాలంటే తెలుగుదేశం నాయకులు చెప్పిన లేదా పసుపు కండువా వేసుకున్నవారికే సంక్షేమ పథకాలు ఇచ్చేవారు అని అన్నారు,నేడు అలాంటి దుస్థితి లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారు అని అన్నారు, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కర్నూలు నగర కార్పొరేటర్లు మున్సిపల్ కో-ఆప్షన్ మెంబెర్లు 14వ వార్డ్ శ్రీరాములు  ,12వ వార్డ్ నయీమ్ పాషా ,మేరమ్మ ,3వ వార్డ్ కార్పొరేటర్ షాజహా పర్వీన్ ,7వ వార్డ్ కార్పొరేటర్ జుబేర్ అహ్మద్ ,44 వ వార్డ్ కార్పొరేటర్ రాజేశ్వర్ రెడ్డి , 48వ వార్డ్ కార్పొరేటర్ మల్లికా బేగం ,46వ వార్డ్ కార్పొరేటర్ వాసు ,49వ వార్డ్ కార్పొరేటర్ సోంపల్లి కృష్ణ కాంత్ రెడ్డి ,50 వ వార్డ్ కార్పొరేటర్ శేఖమద్,42వ వార్డ్ ఇంచార్జి కాశిరెడ్డి శ్వేతా రెడ్డి ,అది మోహన్ రెడ్డి , రైల్వే ప్రసాద్ ,15వ వార్డ్ వెంకటేశ్వరమ్మ ,కేదార్ నాథ్ ,సఫియా ,16వ వార్డ్ పప్పి అన్న  , పవన్  ,51 కృష్ణ కాంత్ శర్మ  52 మహేష్ గారు,2వ వార్డ్ ఇంచార్జి,జిల్లా వాకఫ్ బోర్డు మెంబెర్ ఫైరోజ్ ,24వ అసిఫ్ భాయ్  , డిష్ రాజు ,43వ వార్డ్ రాజేష్ బాబు ,వార్డు ముఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,సచివాలయ కన్వీనర్లు,గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest