హైదరాబాద్
ఆకాలవర్షం కారణంగా పంటనష్టం నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పలు జిల్లాల పర్యటన వివరాలు :
ఉదయం 10:15 బేగంపేట విమానశ్రయం నుండి బయలుదేరి తొలుత ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని రామపురానికి సిఎం కేసిఆర్ చేరుకుంటారు. అక్కడ పంట నష్టం వివరాలు పరిశీలించి, రైతులతో సమావేశమై సంబంధిత చర్యలకు అధికారులకు ఆదేశాలిస్తారు.
అక్కడనుండి మహాబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తాండ చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించి రైతులను సిఎం పరామర్శిస్తారు. పంట నష్టాల వివరాలు పరిశీలించి రైతులకు భరోసా కల్పిస్తారు. సంబంధిత చర్యలకు అధికారులకు ఆదేశాలిస్తారు.
అక్కడనుండి వరంగల్ జిల్లా, దుగ్గొండి మండలం అడవి రంగాపురం చేరుకొని ఆకాల వర్షాలకు, వడగండ్ల వానలకు నష్టపోయిన పంట వివరాలు సిఎం తెలుసుకుంటారు.
అనంతరం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం చేరుకుంటారు. జరిగిన పంట నష్టాన్ని గురించి వివరాలు తెలుకుంటారు, రైతులను పరామర్శించి వారితో సిఎం మాట్లాడుతారు తగు చర్యల నిమిత్తం అధికారులకు ఆదేశాలిస్తారు.