‘మెమొరీస్’ మ్యూజిక్ వీడియో టీజర్ విడుదల

హీరో సుధాకర్ కోమాకుల ‘మెమొరీస్’ మ్యూజిక్ వీడియో టీజర్ విడుదల
నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ యువ నటుడు సుధాకర్ కోమాకుల ‘మెమొరీస్’ అనే మ్యూజిక్ వీడియోతో రాబోతున్నాడు. ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు. శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించారు. అతి త్వరలో ‘మెమొరీస్’ వీడియో సాంగ్ ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో  నివ్రితి వైబ్స్ యూట్యూబ్ వేదికపై రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నివ్రితి వైబ్స్ వారు ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ రైట్స్ ను సొంతం చేసుకోవడం విశేషం.
వర్ధమాన ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో అన్వేష్ సైమా అవార్డ్స్ లో నామినేట్ అయిన ‘చోటు’ అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్ గా.. సోని మ్యూజిక్ లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం ‘మనోహరం’కి రైటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు అనేది ఉంటుంది.
ఈ పాటని అరుణ్ చంద్రశేఖరన్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. ఈ వీడియో సాంగ్ దృశ్యం పరంగా ఆకట్టుకుంటూ సింపుల్ హుక్ స్టెప్ కూడా కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా ఆ స్టెప్ ఉంటుంది.
సుధాకర్ కోమాకుల నేతృత్వంలో నిర్మించబడిన ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది. ఈ సాంగ్ లోని మెలోడీ, వీడియో ఆకట్టుకుంటూ జీవితంలో చోటు చేసుకునే మార్పులని హైలైట్ చేసే విధంగా ఉంటుంది. త్వరలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మ్యూజిక్ వీడియో కోసం ఎదురుచూస్తూ ఉండండి. సాంగ్ టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది.
కో ప్రొడ్యూసర్ :నివ్రితి వైబ్స్
& శరద్ గుమస్తే (రెడ్ సీడర్ ఎంటర్టైన్మెంట్ )
సింగర్స్ : రితేష్ రావు జి (హిందీ), అర్జున్ విజయ్( మలయాళం), సుదర్శన్ ఎస్(తమిళ్), వాసుకి వైభవ్(కన్నడ) , రాహుల్ సిప్లిగంజ్ (తెలుగు)
సంగీతం: అరుణ్ సి
ఎడిటర్ : శ్రీకాంత్ ఆర్ పట్నాయక్
యానిమేషన్ : ఫనీంద్ర మైలవరపు
కెమెరా : బ్రయన్ డర్కీ
లిరిక్స్: పూర్ణ చారి( తెలుగు)
విడుదల: నివ్రితి వైబ్స్
Talented Hero Sudhakar Komakula coming with Multilingual Music Video named MEMORIES soon !
Sudhakar Komakula, after his recent feature film release “Narayana & Co,” takes center stage in the upcoming independent music video “Memories,” produced under his home banner Sukha Media. Sudhakar made this music video as an experiment. i.e.,blending real-world footage with 2D animation, completely shot in the vibrant city of San Francisco, USA. This Music video was partnered with popular Youtube Independent Music Video channel Nivriti Vibes  “Memories” will be available in five languages: Telugu, Tamil, Hindi, Kannada, and Malayalam.
Directed by the aspiring filmmaker Anvesh Bashyam, who previously worked as a concept writer for the SIIMA-nominated short film “Chotu” and as an additional writer and Executive Producer for the musical short film “Manoharam” released by Sony Music South, “Memories” narrates the story of Varun. Through a nostalgic journey down memory lane, the video captures Varun’s transformation from a state of feeling lost to finding his purpose and destination.
The soulful song, composed by Arun Chandrashekaran, is complemented by the enchanting vocals of Rahul Sipligunj in Telugu, Vasuki Vaibhav in Kannada, Susa in Tamil, Arjun Vijay in Malayalam, Ritesh G Rao in Hindi delivering an immersive audio visual experience. Additionally, the video features a simple hook step that invites everyone to join in and dance along.
With Sudhakar Komakula leading the way and producing this project, “Memories” promises to leave audiences entertained across diverse backgrounds. This melodious music video aims to evoke a sense of nostalgia and instill an appreciation for life’s transformative journey. The highly release of “Memories” on Nivriti Vibes YouTube soon. They bagged the song rights for a fancy price.
Co- Producer:
Sharad Gumaste (Red Cedar Entertainment)
Singers: Rahul Sipligunj – Telugu , Ritesh Rao G – Hindi, Arjun Vijay – Malayalam,  Susa – Tamil, Vasuku Vaibhav – Kannada
Music: Arun Chandrashekaran,
Additional Programming: Arun Chiluveru
Teaser editor & DI : Chanakya Reddy Toorupu
Editor: Srikanth R Patnaik Animation: Phaneendra Mylavarapu Camera: Brian Durkee
Lyrics: Purna Chary – Telugu, Varadaraj Chikkaballapura – Kannada, Arjun Vijay – Malayalam, Ritesh G Rao – Hindi, KB Shree Karthik, Bhuvanesh S – Tamil.
Release: Nivriti Vibes
Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest