యాక్షన్ ఫిల్మ్ గా కోనసీమ థగ్స్

కోనసీమ థగ్స్ నుండి ఎలక్ట్రిఫైయింగ్ ఫస్ట్ సింగిల్ విడుదల… ప్రేక్షకుల నుండి విశేష స్పందన
 
పాన్ ఇండియా లెవెల్ లో ఇంటెన్స్ రా యాక్షన్ ఫిల్మ్ గా ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థగ్స్, తెలుగులో కోనసీమ థగ్స్ పేరుతో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తూ జీయో స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
థగ్స్ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో, ట్రైలర్ లు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని చిత్రం పై అంచనాలు పెంచాయి. కోనసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులకు  గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా తెరకెక్కించారు దర్శకురాలు బృంద. హ్రిదు హరూన్, శేషు పాత్రలో  మొదటి చిత్రంతోనే ఆడియన్స్ ను ఆకట్టుకునే నటన కనబరుస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించిన మొదటి వీడియో సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. అమ్మవారు కాళికా రూపంలో ఊరేగింపుగా వచ్చే సన్నివేశం బ్యాక్ డ్రాప్ లో ఈ పాటను రోమంచితంగా చిత్రీకరించారు. ” వీర శూర మహంకాళి వస్తోందయ్యా… వేటాడను ఆ తల్లే వస్తొందయ్యా… ” అంటూ సాగే ఈ పాట చిత్రంలో కీలక సన్నివేశంలో రానుంది. అమ్మవారు పూనినట్లుగా  హృదు చేసిన నృత్యం, డాన్స్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటాయి. శామ్ సి ఎస్ అమ్మ ఉగ్ర రూపాన్ని ఎలివేట్ చేసే ఎనర్జిటిక్ ట్యూన్ ఇవ్వగా వనమాలి చెడును అంతమొందించే క్రోధాన్ని తెలిసేలా లిరిక్స్ అందించారు. ఆస్కార్ అవార్డ్ నామినీ అయిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం నుండి నాటు నాటు పాటను ఆలపించిన కాలభైరవ తన గాత్రంతో పాటను మరింత రోమాంచితంగా ఆలపించారు. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ నైట్ ఎఫెక్ట్ లో చిత్రించిన పాటలో విభిన్న లైటింగ్ తో డివైన్ వైబ్ ను తీసుకురాగలిగారు. కోరియోగ్రఫర్ టర్న్డ్ డైరెక్టర్ బృందా టేకింగ్ కోనసీమ థగ్స్ ఎంత ఇంటెన్స్ గా ఉండనుందో తెలిసేలా ఉంది. ఈ పాట విడుదలయిన కాసేపట్లోనే అద్భుత స్పందన తో ట్రెండింగ్ లోకి వెళ్లిపోవడం విశేషం.
థగ్స్ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషలలో ఫిబ్రవరి, 2023 లో భారీ స్థాయిలో విడుదలకు సిద్దం అవుతోంది.
నటీనటులు:
హ్రిదు హరూన్, సింహ, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్, శరత్ అప్పని మరియు తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం బృంద
నిర్మాణం హెచ్ ఆర్ పిక్చర్స్ – రియా శిబు
సంగీతం – శామ్ సి ఎస్
డీ వో పి – ప్రీయేష్ గురుస్వామి
ప్రాజెక్ట్ డిజైనర్ – జోసెఫ్ నెళ్లికల్
ఎడిటర్ – ప్రవీణ్ ఆంటోనీ
యాక్షన్ – ఫీనిక్స్ ప్రభు, రాజశేఖర్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ముత్తు కురుప్పయ్య
కాస్ట్యూమ్స్ – మాలిని కార్తికేయన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – యువరాజ్
కో డైరెక్టర్ – హరిహరకృష్ణన్ రామలింగం
డిజైనర్ – కబిలన్
పి ఆర్ ఓ – బి ఏ రాజు’స్ టీం (తెలుగు)
Electrifying First Single From ‘Konaseema Thugs’ Is Out… Trends All Across With Terrific Response 
‘Thugs’ ia an intense raw action film helmed by renowned choreographer turned director Brinda Gopal at a Pan India level. Releasing in Telugu as ‘Konaseema Thugs’, this noir-crime action film, is Presented by Riya Shibu, Daughter of Top Producer, Distributor Shibu Thameens under HR Pictures banner in association with Jio Studios on a lavish scale. Shibu Thameen’s son Hridhu Haroon is debuting as Hero with Konaseema Thugs. The other ensemble cast involves Simha, RK Suresh, Munshkanth, Anaswara Rajan in other key roles.
After the grand reception of characters introduction video and trailer of the film from all corners, the film is surrounded by huge buzz. The film which runs in the backdrop of Konaseema, has been narrated by Director Brinda in an intriguing manner.
Hridhu Haroon as Seshu leaves an impression in a raw and rustic role with his debut film. The team has unveiled the first video song from the film. The song comes Asian a procession of Goddess Durga Mata in Kalika avatar. The song is mounted on an electric manner, the lyrics,
” Veera Soora Mahankali Vastondayyaa…
Vetaadanu Aa Thalle Vastondayya…”
hints the song will happen at a crucial juncture of the film. Hridhu’s dance moves are to the point where he body language resembles someone who possesses by the Goddess herself. Sam CS has given an electrifying tune elevating goddess’s anger. While lyricist Vanamaali penned the lyrics matching that Amman is on her course to end the evil. Oscar award nominee RRR movie Naatu Naatu song singer Kaalabhairava has lend the vocals and his energetic voice has taken the song to another level. Priyesh Guruswamy’s different lighting for the song which is shot entirely in the night effect has added a divine vibe to it. Taking of Director Brinda Gopal in the song gives a glimpse about how intense ‘Konaseema Thugs’ film is going to be. The song garners terrific response from all corners for its energetic composition and choreogrpahy. It began trending across all over the internet.
Konaseema Thugs is gearing up to release in Telugu, Tamil, Hindi and Kannada languages in February, 2023 in a grand manner.
Cast :
Hridhu Haroon, Simha, RK Suresh, Munishkanth, Anaswara Rajan and others
Crew :
Directed By Brinda
Produced By HR Pictures – Riya Shibu
Music By Sam CS
Written By Shibu Thameens
DOP: Priyesh Guruswamy
Project Designer: Joseph Nellickal
Editor: Praveen Antony
Action: Pheonix Prabhu & Rajasekar
Creative Producer: Muthu Kuruppaiah
Costume: Malini Karthikeyan
Executive Producer: Yuvaraj
Co Director: Hariharakrishnan Ramalingam
Designer: Kabilan
PRO: BA Raju’s Team
Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest