రంగమార్తాండలో ప్రకాష్ రాజ్ నట విశ్వరూపం చూస్తారు : బ్రహ్మానందం 

హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఇళయరాజా సంగీతం సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రంగమార్తాండ.
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రలు పోషిస్తున్న “రంగమార్తాండ” చిత్ర లిరికల్స్ సాంగ్స్ తో ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటుంది, మరాఠీ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా ‘నట్ సామ్రాట్’ కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా మార్చి 22న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, శివాత్మిక, అలీ రేజా, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు  మీడియా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ… మొదట కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ వచ్చి ఈ సినిమాలో నన్ను నటించాలని అడిగినప్పుడు కొంత ఆశ్చర్యపోయాను. మీరు తప్పితే ఈ పాత్రకు ఎవరు సరికారు అని కూడా అన్నారు. కొన్ని సన్నివేశాలు పూర్తి చేసిన తర్వాత ప్రకాష్ రాజ్ ఓ రాత్రి ఫోన్ చేసి ఈరోజు షూటింగ్లో మీరు చేసిన సీన్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేవారు. ఆ విషయం ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన చెప్పారు అంటే ఆయన క్యారెక్టర్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ప్రకాష్ తెలుగు వ్యక్తి కాకపోయినప్పటికీ కూడా అతనికి తెలుగుపై చాలా పట్టుంది. అందులో సినిమాలోని డైలాగ్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేశాడో కానీ అద్భుతంగా చెప్పాడు. కొన్ని సన్నివేశాలు బాగా రాకపోయినప్పటికీ కూడా కొన్ని సీన్స్ కట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు అని మొదట అన్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ సింగిల్ టేక్ లోనే కావాలని అన్నారు. ఆ తర్వాత నేను సింగల్ టేక్ లోనే చేయడం జరిగింది. దీంతో ప్రకాష్ రాజ్ పక్కనే ఉండి ఇది వన్ మోర్ అన్నావంటే చంపేస్తాను అని కృష్ణవంశీకి హెచ్చరిక చేశాడు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని కృష్ణవంశీ ఎంతో చక్కగా తెరపైకి తీసుకువచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ప్రకాష్ రాజ్ విశ్వరూపం చూపించారు. అలాగే రమ్యకృష్ణ మిగతా నటీనటులు కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. ఇక ఇలాంటి సినిమాలు అందరూ చూడాలి. తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ఇది.. అని బ్రహ్మానందం వివరణ ఇచ్చారు.
దర్శకులు కృష్ణవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమా రూపొందడానికి ముఖ్య కారణం ప్రకాష్ రాజ్ గారు. ఈ సినిమాను రీమేక్ చేయాలనుకున్నప్పుడు మొదట నేను చూడలేదు. అతని సలహాతోని చూడడం జరిగింది. ఆ తర్వాత అతను రైట్స్ తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. ఈ సినిమా నువ్వే డైరెక్ట్ చేయాలని అన్నాడు. అప్పుడు నేను నా దర్శకత్వం కోణంలో అర్థం చేసుకొని ఎలా చెబితే మన వాళ్ళకు అర్థం అవుతుంది అని ఆలోచించి ఈ సినిమాను తెరపైకి తీసుకు రావడం జరిగింది. ప్రకాష్ రాజ్ ఎలా నటిస్తాడో నాకు పూర్తిగా తెలుసు. ఇక ఇందులో తన నట విశ్వరూపం చూపించాడు. ఇక అలాంటి నటుడుని ఒక చెత్త నటుడు అని అనాలి అంటే అలాగే ఒక చెంప దెబ్బ కొట్టడానికి ఒక పాత్ర కావాలి అన్నప్పుడు.. ఆ పాత్ర చేయగలిగే సత్తా ఎవరు ఉన్నప్పుడు.. చాలామంది యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇక బ్రహ్మానందం గారిని ఎందుకు ఫిక్స్ చేయకూడదు అని అనుకున్నాను. ఆయన కేవలం నటుడే కాదు తెలుగు భాష మీద ఎంతో పట్టు ఉంది. అలాగే ఆయనకు ఎన్నో విషయాల గురించి తెలుసు. నేను ఆయనను డాడీ అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఉంటాను. వేలాది సినిమాలు చేసిన ఆయన గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆయన ఒక మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ కూడా. ఆయన ఒక కామెడీయన్. అలాంటి వ్యక్తిని ఇంత ట్రాజెడీ క్యారెక్టర్ కోసం ఎలా సెట్ చేయాలి అని సందేహం మొదట నుంచి ఉంది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కు చెప్పగానే ఆయన బ్రహ్మానందం గారికి ఫోన్ చేశారు. ఇక ఇంటికి వెళ్లి చెప్పగానే ఒకసారి ఒరిజినల్ నట సామ్రాట్ ను చూడమని చెప్పాను. కానీ ఆయన అదేమీ చెప్పకుండా ఎప్పుడైనా సరే మీ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాను అని వెంటనే ఓకే చెప్పేశారు. ఆ తర్వాత ఆయన షూటింగ్లో ఒక చిన్న పిల్లాడి తరహాలో అప్పుడే వచ్చినా కొత్త ఆర్టిస్టులాగే వర్క్ చేశారు. మిగతా అందరిని కూడా నువ్వు ఎలా వర్క్ చేయించుకుంటావో నన్ను కూడా అలానే వర్క్ చేయించుకోండి. మీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్పేవారు. ఇక ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించాడు. ఇక రమ్యకృష్ణ కూడా అద్భుతంగా నటించింది. మిగతా చాలా మందిని ఆ పాత్ర కోసం సంప్రదించాము. కానీ ఆమెని ఎంతో ఇష్టంగా ఈ సినిమా చేయడానికి వచ్చింది. అలాగే అనసూయ కూడా ఎంతో చక్కగా నటించింది మిగతా నటినటులు కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్క మీడియా సభ్యులు కూడా ఎంతగానో మెచ్చుకున్నారు. అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలి. కృష్ణవంశీతో నాకు ఎన్నో ఏళ్ళ పరిచయం ఉంది. ఆ ప్రయాణం తర్వాత మా కాంబినేషన్లో అంతపురం ఖడ్గం గోవిందుడు అందరివాడే ఇలా కొన్ని సినిమాల వచ్చాయి. ఇప్పుడు రంగమార్తాండ వరకు వచ్చింది. నట సామ్రాట్ సినిమా చూసిన తర్వాత ఒక కళాకారుడు జీవితం లో ఉన్న ఒక బరువు గురించి నాకు అర్థం అయింది. ఇలాంటి కథను నేను చూపించాలని అనుకున్నాను. ఒక నటుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఎన్నో తెలియని విషయాల్లో కూడా కొనసాగాల్సి వస్తుంది. అది చాలా విషాదం. అది ఒక నిజ జీవితంలోని బరువైన బ్రతుకు. ఈ సినిమాలో నాకు ఒక జీవితం కనిపించింది. అలాగే ఈ సినిమాలో ఒక నటుడిగా కూడా నేను భాగం కావాలి అనుకున్నాను. కృష్ణవంశీ చెప్పగానే బావుంది అని చెప్పాడు. ఇక అతను డైరెక్ట్ చేయమని ఎందుకు అన్నాను అంటే అతను మాత్రమే ఎమోషన్స్ ను చాలా చక్కగా ప్రజెంట్ చేయగలడు. ఒక విధంగా రంగమార్తాండ కృష్ణవంశీ డైరెక్ట్ చేయలేదు. అతని జీవితాన్ని కూడా చూపించాడు అని చెప్పవచ్చు. ఇక బ్రహ్మానందం గారు కూడా ఈ సినిమాలో భాగం కావాలని అన్నప్పుడు నేను మరో ఆలోచన చేయలేదు. ఆయన నటించిన తర్వాత నేను చాలా దగ్గరగా ఒక విశ్వరూపాన్ని చూశాను అనిపించింది. ఆ మ్యాజిక్ చూసే భాగ్యం నాకు దొరికింది. అలాగే ఈ సినిమాలో మిగతా నటినటులు కూడా చాలా అద్భుతంగా నటించారు. కృష్ణవంశీ ప్రతి ఒక్క టెక్నీషియన్ తో చాలా అద్భుతంగా వర్క్ చేయించారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనే నమ్మకం అందరికీ ఉంది. ఇలాంటి సినిమా అందరికీ కావాలి.. అని ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest