రాయ్ పూర్ , ఫిబ్రవరి 25 :
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సంచలన ప్రకటన చేశారు. కీలక రాజకీయాలకు దూరంగా ఉండదలచుకున్నానని ఆమె స్పష్టం చేశారు. రాయ్ పూర్ లో జరిగిన 85వ జాతీయ కాంగ్రెస్ ప్లీనరీలో సోనియా గాంధీ మాట్లాడుతూ కీలక రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటన చేశారు. ఉత్తర్ ప్రదేశ్ రాయ్ బరేలీ నుంచి ఎంపీగా ఉన్న సోనియాగాంధీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ కష్టకాలంలో బాధ్యతలు చేపట్టి రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీ కృషి చేశారు. 10 ఏళ్ళ UPA ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించిన నాయకురాలు సోనియా గాంధీ అని ప్లీనరీ లో మాట్లాడిన వారు ప్రశంసించారు. భారత్ జోడో యాత్ర తరువాత తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగించటం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. అయితే కాంగ్రెస్ కు, దేశానికి కూడా 2024 ఎన్నికలు పరీక్షలాంటివి.దేశంలో ప్రజాస్వామ్యం బ్రతకాలంటే కాంగ్రెస్ మళ్ళీ రావాలి అంటూ సోనియా భావోద్వేగాపూరిత ప్రకటన చేశారు.