కొవ్వూరు:
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం – కోల్ కతా నందు నిర్వహించే 45వ జాతీయ సబ్-జానియర్ వాలీబాల్ పోటీలు పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలికల జట్టుకు రాష్ట్ర హోం మంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కిట్లను, ట్రాక్ లను అందజేశారు. రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారిచే పంపింణీ చేయబడిన 2 జతల క్రీడా దుస్తులు, ట్రాక్ సూట్ లను హోంమంత్రి గురువారం క్యాంపు కార్యాలయం నందు జట్టు సభ్యులకు అందచేసారు. జట్టు సభ్యులు జాతీయ పోటీలలో విజయం సాధించాలని అకాంక్షించారు. జట్టు సభ్యులకు కోచ్ లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఈనెల 28 వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నెల 20వ తేదీనుండీ 25 వ తేదీ వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాలీబాల్ అసోసియేషన్, అవంతి సంస్థల ఆర్థిక సహకారంతో కొవ్వూరు N.T.R. క్రీడా ప్రాంగణం అల్లూరి వెంకటేశ్వర రావు వాలీవాల్ గ్రౌండ్ నందు శిక్షణా శిబిరం నిర్వహించారు. శిక్షణా శిబిరములోని 12 మంది బాలికల జట్టుకు S. గౌస్ బాషా (కడప), కొయ్యల ప్రసాద్ (పశ్చిమ గోదావరి) S. బాలాజీ (తూర్పు గోదావరి) కోచ్ లుగా వ్యవహరించారు.
ఈ పంపిణీ కార్యక్రమంలో నగళ్ళ పాటి శ్రీనివాసు, వరిగేటి సుధాకర్, బండి పట్టాభి రామారావు తదితరులు పాల్గొన్నారు.